Satya : టాలీవుడ్‌లో యువ హీరో మృతి.. తల్లి, భార్య మరణం తట్టుకోలేకే..

 టాలీవుడ్ సినీ పరిశ్రమలో తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ గా నటించి వరం, బ్యాచిలర్స్‌ లాంటి సినిమాల్లో హీరోగా నటించిన యువ కథానాయకుడు సత్య..............

Satya : టాలీవుడ్‌లో యువ హీరో మృతి.. తల్లి, భార్య మరణం తట్టుకోలేకే..

Satya

Satya :  టాలీవుడ్ సినీ పరిశ్రమలో తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ గా నటించి వరం, బ్యాచిలర్స్‌ లాంటి సినిమాల్లో హీరోగా నటించిన యువ కథానాయకుడు సత్య గుండెపోటుతో కన్నుమూశారు. సత్య పూర్తి పేరు వి.రామసత్యనారాయణ. ఇండస్ట్రీలో హీరో అవ్వాలని ట్రై చేస్తూ మొదట పలు సినిమాల్లో హీరో స్నేహితుడి పాత్రలు పోషించారు. ఆ తర్వాత వరం సినిమాతో హీరోగా మారారు. అయితే ఈ సినిమా విజయవంతం ​కాలేదు. తర్వాత బ్యాచిలర్స్‌ సినిమాలో కూడా హీరోగా చేశాడు. ఇది కూడా ఫ్లాప్ గానే మిగిలింది. దీంతో కరోనాకి ముందు సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి బిజినెస్‌పైన దృష్టి పెట్టారు.

Suhani Kalita : తూనీగా తూనీగా అని ఆడిపాడిన అమ్మాయి.. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుంది..

అయితే కరోనా సమయంలో తల్లిని, భార్యను పోగొట్టుకున్నారు. అప్పట్నుంచి ఆ విషాదంలోనే బతుకుతున్నారు. సత్యకి ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉంది. తల్లి, భార్య చనిపోయిన దగ్గర్నుంచి మానసిక క్షోభను అనుభవిస్తున్నారు సత్య. దీంతో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్య గురువారం సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సత్య మరణవార్త తెలిసి ఆయన సన్నిహితులు, పలువురు టాలీవుడ్ వ్యక్తులు సంతాపం తెలుపుతున్నారు.