Devi Sri-Thaman: చేయి పడితే సినిమా హిట్టే.. థమన్ దేవీల మధ్య టఫ్ ఫైట్!

చేయి పడితే ఆ సినిమా హిట్టే. ఇదీ ఇప్పుడు ఇద్దరు సంగీత దర్శకుల సినిమాలపై తెలుగు సినీ పరిశ్రమలో టాక్. ఆ ఇద్దరూ చేసేది స్టార్ హీరోల సినిమాలే అయినా.. స్టార్ ని బట్టి సంగీతం మారిపోతుంది.

Devi Sri-Thaman: చేయి పడితే సినిమా హిట్టే.. థమన్ దేవీల మధ్య టఫ్ ఫైట్!

Devi Sri Thaman

Devi Sri-Thaman: చేయి పడితే ఆ సినిమా హిట్టే. ఇదీ ఇప్పుడు ఇద్దరు సంగీత దర్శకుల సినిమాలపై తెలుగు సినీ పరిశ్రమలో టాక్. ఆ ఇద్దరూ చేసేది స్టార్ హీరోల సినిమాలే అయినా.. స్టార్ ని బట్టి సంగీతం మారిపోతుంది. అందుకే దర్శక, నిర్మాతలకు బెస్ట్ అప్షన్ గా మారిపోయారు. చిరంజీవి లాంటి సీనియర్ హీరోల దగ్గర నుండి రామ్ లాంటి యంగ్ హీరోల వరకు అందరి సినిమాలకు వీళ్ళే.

Romantic: ప్రీమియర్ చూసిన సెలబ్స్.. ఆకాష్ బాగా హ్యాండిల్ చేశాడని ప్రశంసలు!

అయితే.. దేవిశ్రీ అయినా కావాలి.. లేదంటే థమన్ అయినా ఉండాలి. ఇది ఇప్పుడు లెక్క. అంతగా స్టార్స్ ఫెవరేట్ మ్యుజిషియన్స్ అయిపోయారు ఈ ఇద్దరూ. సినిమా సక్సెస్ కావాలంటే అందులో మ్యూజిక్ పాత్ర చాలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పాటల వలన కూడా హిట్ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడంతా రెండు వారాల సినిమాలే కావడంతో ముందు నుండే సినిమా మీద అంచనాలు పెరగాలంటే మంచి ఆల్బమ్ తప్పనిసరి కావాలి. అందుకే థమన్, దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరూ ఈ బాధ్యతను స్టార్స్ అనుకున్నట్లుగా చేసి పెడుతున్నారు.

Soundarya Sharma: సౌందర్యకి దాచుకోడం మా చెడ్డ చిరాకేమో!

అప్పుడప్పుడు కాపీ చేశాడని సోషల్ మీడియాలో థమన్ మీద విమర్శలు వినిపిస్తున్నా.. తానేమీ తగ్గని నిరూపించేలా సినిమాలు చేసి చూపిస్తున్నాడు. అరవింద సామెత, అల వైకుంఠపురం లాంటి సినిమాల సక్సెస్ లో థమన్ పాత్ర ఎవరూ కాదనలేనిది. ఇక దశాబ్ద కాలంగా దేవిశ్రీ దుమ్ము రేపుతూనే ఉన్నాడు. ఒక విధంగా ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండగా.. ఈ ఇద్దరూ కాకుండా స్టార్స్ ఛాయిస్ గా మరొకరికి మాత్రం పెద్దగా స్పేస్ దక్కడం లేదు. ఒకటీ ఆరా సినిమాలకు మిగతా వాళ్ళు కాస్త వైబ్రేషన్ తెచ్చినా వీరి ధాటికి నిలబడలేకపోతున్నారు. మరి ఎన్నాళ్ళో ఈ ప్రయాణం.