Heart Touching video : కల్మషం లేని ఈ పసిప్రేమకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే

కల్మషం లేని ఈ పసిపిల్లల ప్రేమకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఓ చిన్నపిల్లాడిని మరో పిల్లాడు కౌగలించుకున్న తీరు మనస్సుల్ని ఆకట్టుకుంటోంది.

Heart Touching video : కల్మషం లేని ఈ పసిప్రేమకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే

Kids Real Love

Toy Sellers Son Hugging A Little Boy : ‘పిల్లలు, దేవుడు చల్లని వారే..కల్లకపటమెరుగని కరుణామయులే’ అనే పాటకు ఇదిగో ఈ పసిపిల్లాడు ప్రత్యక్ష నిదర్శం. పసిపిల్లలకు కల్లాకపటం తెలియదు. ఉన్నవారు లేనివారు అనే తేడా తెలియదు. వారికి తెలిసిందల్లా..తోటి పిల్లలు కనిపిస్తే వారితో కలిసి ఆడుకోవటం. ఆటల్లో కొట్టుకున్నా తిరిగి వారితోనే కలిసి ఆడుకోవటం పసిపిల్లలు కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమకు తార్కాణం పసిబిడ్డలు. చిన్నపిల్లలను దేవుడుతో సమానం అంటారు.

దేవుడికి పేద గొప్పా ఉండదు. రాజు అయినా పేద అయినా ఒక్కటే. అలాగే పసిపిల్లలు కూడా అంతే. తోటిపిల్లలతో కలిసి ఆడుకోవటమే తెలుసువారికి. ప్రేమతో కౌగలించుకోవటం..వారి దగ్గరుండే తినుబండారాలు పంచుకోవటమే వారికి తెలిసిందల్లా..అటువంటి ఓ కల్మషం లేని పసిప్రేమ ఇదిగో ఈ వీడియోలో మరోసారి చూసేయండి..వావ్..అని తప్పకుండా అనిపిస్తుంది. వారి చిరునవ్వులు చూస్తే మనస్సులోని ఒత్తిడి అంతా హుష్ కాకి అని ఎగిరిపోతుంది.

ఈ వీడియోలో ఓ పిల్లాడు రోడ్డు మీద బొమ్మలు అమ్ముకునే ఓ మహిళ పిల్లాడు మరో పిల్లాడిని కౌగలించుకోవటం కనిపిస్తుంది. కియాన్ష్ దేటే అనే బాలుడు బొమ్మలు అమ్ముకునే మహిళ కొడుకు ముందు నిలబడి యాక్టివ్ గా డ్యాన్స్‌ చేస్తుంటాడు. బొమ్మలు అమ్ముకునే మహిళ కొడుకుని కూడా డ్యాన్స్‌ చేయమంటూ కియాన్ష్‌ ప్రోత్సహిస్తాడు. ఆ మహిళ కొడుకు కియాన్ష్‌ ను అలాగే చూస్తు దగ్గరగా  వచ్చి ప్రేమగా కౌగలించుకుంటాడు.

అప్పుడు  కియాన్ష్‌ డ్యాన్స్‌ చేయడం ఆపి అలా చూస్తాడు. కాసేపటికీ కియాన్ష్‌ కూడా ఆ మహిళ కొడుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుంటాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కియాన్ష్‌ తల్లి అశ్విని నికమ్ దేటే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయటంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.కల్మషం లేని ప్రేమంటే పసివారిదేనంటున్నారు. ఈ వీడియో చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..