Independence Day 2023: గోల్కొండకోట పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఇవే..

గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ఏ గోల్డ్, ఏ పింక్, బీ నీలం పాసులు ఇప్పటికే అందజేశారు.

Independence Day 2023: గోల్కొండకోట పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఇవే..

Golconda Fort

Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గోల్కొండకోట ప్రాంతంలో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ట్రాఫిక్ అంక్షలు అమల్లో ఉంటాయి. అయితే, ఈ వేడుకలకు వచ్చేవారికోసం ప్రత్యేక రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. వారు వెళ్లాల్సిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలపై ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ ఇచ్చారు.

Independence Day 2023: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి.. ఏం చెప్పారంటే

వేడుకలకు వచ్చేవారు వెళ్లాల్సిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు ఇవే..

– గోల్కొండకోటలో స్వాతంత్ర్య వేడుకలకోసం రాణిమహల్‌ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకు ఉన్న రోడ్డు మూసివేశారు.

– స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ఏ గోల్డ్, ఏ పింక్, బీ నీలం పాసులు ఇప్పటికే అందజేశారు. ఆ పాసులు కలిగిన వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.

– సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్యాంక్, మెహిదీపట్నం వైపు నుంచి గోల్డ్, ఏ పింక్, ఏ నీలం పాసులు ఉన్న వారిని గోల్కొండ కోట వరకు అనుమతిస్తారు.

– ఏ గోల్డ్ పాసులున్నవారు వాహనాలను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఫతేదర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

– ఏ పింక్ పాసులున్న వాహనదారులు కోట ప్రధాన ద్వారం నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ బస్టాప్ వద్ద పార్క్ చేయాల్సి ఉంటుంది.

– బీ నీలం పాసులున్న వాహనదారులు గోల్కొండ బస్టాప్ దగ్గర కుడి మలుపు తీసుకొని ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

– సీ గ్రీన్ పాసులున్న వాహనదారులు గోల్కొండ కోట ప్రధాన ద్వారం నుంచి 500 మీటర్ల దరంలో ఉన్న ఓసీ/ జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలని పోలీసులు సూచించారు.

– డీ  రెడ్ పాసులున్న వారు ప్రియదర్శిని స్కూల్లో పార్కింగ్ వాహనాలు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

– ఈ బ్లాక్ పాసులన్న వారు ఫతేదర్వాజా వైపు వెళ్లి హుడా పార్క్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

– షేక్‌పేట్, టోలీచౌకీ నుంచి వచ్చే సాధారణ ప్రజలు వాహనాలను సెవెన్ టూంబ్స్ లోపల పార్కింగ్ కు అనుమతి ఇచ్చారు.