SSMB28 : డైరెక్షన్ చేయకుండా క్రికెట్ ఆడుతున్న త్రివిక్రమ్.. వైరల్ వీడియో!

సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ 'SSMB28' చాలా రోజులు తరువాత ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టుకొంది. కాగా షూటింగ్ బ్రేక్ సమయంలో త్రివిక్రమ్ క్రికెట్ ఆడుతున్న ఒక వీడియో బయటకి వచ్చింది.

SSMB28 : డైరెక్షన్ చేయకుండా క్రికెట్ ఆడుతున్న త్రివిక్రమ్.. వైరల్ వీడియో!

trivikram ssmb28

SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ ‘SSMB28’ చాలా రోజులు తరువాత ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టుకొంది. గత ఏడాది మధ్యలోనే చిత్రీకరణ మొదలు పెట్టుకున్న ఈ మూవీ అనుకోని సమస్యలతో షూటింగ్ కి లాంగ్ బ్రేక్ పడింది. ఇక ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా హైదరాబాద్ సారధి స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటుంది. దీంతో ఈ సెట్స్ నుంచి రోజు ఏదొక ఫోటో, వీడియో లీక్ అవుతూ వస్తున్నాయి.

SSMB28: నైజాం రైట్స్‌తో దుమ్ములేపిన మహేష్-త్రివిక్రమ్.. నిజమేనా..?

తాజాగా షూటింగ్ బ్రేక్ సమయంలో త్రివిక్రమ్ క్రికెట్ ఆడుతున్న ఒక వీడియో బయటకి వచ్చింది. డైరెక్టర్ మైక్ పట్టుకొని సినిమాలతో బౌండరీలు కొట్టడము తెలుసు, బ్యాట్ పట్టుకొని బాల్‌తో బౌండరీలు కొట్టడమూ తెలుసు అంటున్నాడు. బ్రేక్ టైములో సెట్ లో ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ లతో కలిసి కాసేపు సరదాగా క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశాడు త్రివిక్రమ్. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు నెట్టింట పోస్ట్ చేయగా, ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

కాగా ఈ సినిమాలో మహేష్ బాబు సరి కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల ఈక్వల్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరో హీరోయిన్ సంయుక్త మీనన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది అంటున్నారు. గతంలో త్రివిక్రమ్, మహేష్ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం వీరిద్దరూ కూడా సక్సెస్ ట్రాక్ లో ఉండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఆ అంచనాలని త్రివిక్రమ్ అందుకోగలడా? లేదా? అనేది చూడాలి.