Pushpa: పుష్ప సినిమాపై టీఆర్ఎస్ నేత అనుచిత వ్యాఖ్యలు!

పుష్ప సినిమా ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసిన ఈ సినిమా నార్త్ లో బన్నీకి తొలిసారి వందకోట్లు వసూలు చేసిన..

Pushpa: పుష్ప సినిమాపై టీఆర్ఎస్ నేత అనుచిత వ్యాఖ్యలు!

Pushpa (1)

Pushpa: పుష్ప సినిమా ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసిన ఈ సినిమా నార్త్ లో బన్నీకి తొలిసారి వందకోట్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. నార్త్ నుండి సౌత్ వరకు తగ్గేదెలా అంటూ అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టాడు. సినిమా థియేటర్లలో ఉండగానే ఓటీటీలో వచ్చినా అటు డిజిటల్ రిలీజ్.. ఇటు థియేటర్లలో ఎక్కడా ఈ సినిమా జోష్ తగ్గలేదు.

Mahesh-Vijay Devarakonda: మహేశ్ వర్సెస్ విజయ్.. పోటాపోటీ యాడ్స్!

ఇంత ఘనవిజయం సాధించిన ఈ సినిమాపై ఈ మధ్య నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోను స్మగ్లర్ గా చూపించడంపై ఈ మధ్యనే ప్రవచనకర్త, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు విరుచుకుపడ్డారు. స్మగ్లర్ ను హీరోగా చూపించి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటూ గరికపాటి పుష్ప మేకర్స్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ఇప్పుడు ఓ టీఆర్ఎస్ పార్టీ నేత పుష్ప సినిమాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Unstoppable with NBK: ఫినాలే ఎపిసోడ్.. కళ్లు చెమ్మగిల్లేట్టు బాలయ్య వ్యాఖ్యలు!

ఓ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ నేత, తెలంగాణ గాయకుడు సాయి చంద్ పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కూల్ పిల్లలు అల్లరి చేస్తూ ఉండడంతో.. పుష్పలో హీరో అనుకుంటున్నాడు వాడు, వాడిని చక్కగా కుర్చోపెట్టండి.. ఈ హౌలేగాళ్ళందరూ తగ్గేదే లేదు అంటూ హీరోలు చేసిన తర్వాత పిలగాళ్లను కంట్రోల్ చేసుడు కష్టమైందని.. ఈ సినిమాలను తీసే ఎదవలను చెప్పుతో కొట్టాలి ఫస్ట్ అంటూ ఫైర్ అయ్యారు.