Bandi Sanjay : గ్రూప్-1 పరీక్షల్లో భారీ అక్రమాలు.. వారంతా బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులే-బండి సంజయ్

గ్రూప్-1 పరీక్షల్లో నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారి వద్ద పని చేసే వాళ్లు గ్రూప్-1 పరీక్షల్లో క్వాలిఫై అయినట్లు తమకు సమాచారం అందుతోందన్నారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్ విండో ఛైర్మన్ పిల్లలు, బంధువులు క్వాలిఫై అయినట్లు బండి సంజయ్ చెప్పారు.

Bandi Sanjay : టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణలో సంచలనం రేపింది. రాజకీయంగానూ దుమారం సృష్టించింది. అధికార పక్షాన్ని బీజేపీ టార్గెట్ చేసింది. ఛాన్స్ చిక్కితే చాలు.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా మరోసారి క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గ్రూప్-1 పరీక్షల్లో నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారి వద్ద పని చేసే వాళ్లు గ్రూప్-1 పరీక్షల్లో క్వాలిఫై అయినట్లు తమకు సమాచారం అందుతోందన్నారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్ విండో ఛైర్మన్ పిల్లలు, బంధువులు క్వాలిఫై అయినట్లు బండి సంజయ్ చెప్పారు.

Also Read..TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

” ఒకే మండలం నుండి 50 మందికిపైగా క్వాలిఫై అయ్యారు. ఒక చిన్న గ్రామంలో ఆరుగురు క్వాలిఫై అయ్యారు. వీరంతా బీఆర్ఎస్ నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పని చేసే వాళ్లే. కేసీఆర్ కొడుకే బాధ్యుడు. కేసీఆర్ నియమించిన సిట్ విచారణ ఎలా చేయగలదు? సిట్టింగ్ జడ్జి విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాల్సిందే. నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో ఛైర్మన్ కొడుకుతో పాటు ఒక జడ్పీటీసీ వద్ద బాడీగార్డ్ గా పని చేసే వ్యక్తి కొడుకు క్వాలిఫై అయ్యారు. ఒక సర్పంచ్ కుమారుడికి అర్హతయ్యే అవకాశమే లేనప్పటికీ.. క్వాలిఫై చేశారు. కేసీఆర్ కొడుకు సహకారంతోనే ఇది జరిగింది. ఆయన సన్నిహిత వ్యక్తే ఇదంతా చేశారు. ఒక్కొక్కరి దగ్గర రూ.3 నుండి 5 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం ఉంది.

Also Read..TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రాజశేఖర్ రెడ్డి లీలలు

తక్షణమే కేసీఆర్ కొడుకును కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి. సీఎం కొడుకు ప్రమేయం ఉన్న నేపథ్యంలో ఆయన నియమించిన సిట్ తో విచారణ ఎలా సాధ్యం? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. నయీం డైరీ, సినీ తారల డ్రగ్స్ తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సైతం సిట్ కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోంది.

లక్షలాది మంది నిరుద్యోగులను వంచించిన కేసీఆర్ ప్రభుత్వం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలు, కేసీఆర్ కొడుకు నిర్వాకంపై అతి త్వరలోనే వాస్తవాలు బయటపెడతాం. అసలైన దోషులను తెలంగాణ సమాజం ముందుంచుతాం” అని బండి సంజయ్ అన్నారు.

Also Read..Minister KTR : పేపర్ లీకేజీ వెనుక ఎవరున్నా వదిలిపెట్టం.. బీజేపీపై అనుమానం : మంత్రి కేటీఆర్

ట్రెండింగ్ వార్తలు