ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

కవిత బెయిల్ పిటీషన్ల పై రేపు మధ్యాహ్నం 12గంటలకు వాదనలు వినిపిస్తామని ఈడీ, సీబీఐ కోర్టుకు తెలిపింది. రేపు ఆధారాలతో సహా వాదనలు వినిపిస్తామని

MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లపై ఢిల్లీ హైకోర్టులో సోమవారం విచారణ కొనసాగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీల్యాండరింగ్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. 40 నిముషాల పాటు కవిత తరపు విక్రమ్ చౌదరి కోర్టులో వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా కవిత అరెస్టు జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన శరత్ రెడ్డికి బెయిల్ ఇచ్చారని, ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారని కోర్టుకు వివరించారు. శరత్ రెడ్డి 55కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి విరాళం ఇచ్చారని, శ్రీనివాస్ రెడ్డి ఎన్డీయే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారని కోర్టు దృష్టికి విక్రమ్ చౌదరి తీసుకెళ్లారు. గత ఏడాది సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించి కవితను అరెస్టు చేసినట్లుగా కోర్టుకు తెలిపారు. విక్రమ్ చౌదరి బాగా వాదనలు వినిపించారని జడ్జి స్వర్ణకాంత శర్మ అభినందించారు.

Also Read : MLC Kavitha : కవిత జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించిన సీబీఐ కోర్టు

ఇదిలాఉంటే.. కవిత బెయిల్ పిటీషన్ల పై రేపు మధ్యాహ్నం 12గంటలకు వాదనలు వినిపిస్తామని ఈడీ, సీబీఐ కోర్టుకు తెలిపింది. రేపు ఆధారాలతో సహా వాదనలు వినిపిస్తామని కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హోస్సేన్ తెలిపారు. దీంతో జడ్జి స్వర్ణకాంత శర్మ కవిత బెయిల్ పిటీషన్ పై తీర్పును రేపటికి రిజర్వ్ చేశారు. రేపు ఈడీ,సీబీఐ వాదనల అనంతరం కౌంటర్ వాదనలు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టుకు వినిపించనున్నారు. ఇరువురి వాదనలు విన్న తరువాత కవిత బెయిల్ పిటీషన్ పై  కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.

Also Read : Mlc Kavitha : అలాంటి వాళ్లను దేశం దాటించారు- రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సంచలన వ్యాఖ్యలు

  • కవిత తరపు న్యాయవాది వాదనలు సాగాయి ఇలా..
    ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసు, సీబీఐ కేసులో కవితకు బెయిల్ ఇవ్వాలని కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు.
    లిక్కర్ పాలసీ ఈడీ కేసు దర్యాప్తు, ఈడీ విచారణ సహా కవిత అరెస్ట్, ట్రయల్ కోర్టు, సుప్రీంకోర్టు లో జరిగిన విచారణ అంశాలపై వాదనలు వినిపించారు.
    నిబంధనలకు విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా కవిత అరెస్ట్ జరిగింది.
    లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు.
    మహిళలను విచారించే విషయంలో స్పష్టత కోసం, సీఆర్పీసిలో ఉన్న అంశాలు లెవనెత్తుతూ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేశాం.
    సుప్రీంకోర్టు పిటిషన్ స్వీకరించి విచారణ చేపట్టి, దర్యాప్తు సంస్థకు నోటీసులు కూడా జారీ చేసింది.
    విచారణ జరుగుతుండగా సమన్లు ఇచ్చారు.
    ఆ విషయం సుప్రీంకోర్టులో ప్రస్తావించగా.. తదుపరి విచారణ వరకు సమన్లు ఇవ్వమని అదనపు సోలిసిటర్ జనరల్ ఒక ప్రకటన చేశారు.
    అకస్మాత్తుగా ఒకరోజు ఇంటిలో సోదాలు నిర్వహించారు.
    అదేరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగడం, ఆ సందర్భంగా.. ఇకపై ఎలాంటి రిలీఫ్ దొరకదని అదనపు సోలిసిటర్ జనరల్ చెప్పడం, అదేరోజు సాయంత్రానికి అరెస్టు చేయడం జరిగిపోయాయి.
    కేసు నమోదు చేసినప్పుడు FIRలో నిందితుల జాబితాలో కవిత పేరు లేదు.
    తర్వాత కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ లలో పేరు ప్రస్తావించి, ఇప్పుడు అంతా చేశారని ఆరోపిస్తున్నారు.
    అరెస్టు చేసిన తరువాత కూడా బెయిల్ కోసం కోరితే ట్రయల్ కోర్టు అంగీకరించలేదు.
    ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారు, వారికి పరీక్షలు ఉన్నాయని విజ్ఞప్తి చేసినా కనికరం చూపలేదు.
    ఒక పార్టీలో ముఖ్య నాయకురాలిగా, ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టి అరెస్టు చేశారు.
    ఒక మహిళగా ఉన్న హక్కుని కూడా కాలరాసే విధంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించాయి.
    మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేశామని ఆరోపించారు.
    వాడని మొబైల్ ఫోన్లు వేరే వారికి ఇస్తే.. వాళ్ళు ఫార్మాట్ చేసి వాడుకున్నారు.
    దానికి కూడా బాధ్యత తమపై మోపడం అన్యాయం.
    కేవలం రాజకీయ కక్ష పూరితమైన విధానంతో నమోదు చేసిన కేసు ఇది.
    కవిత రాజకీయ నాయకురాలు కాబట్టి అరెస్ట్ చేశారు.
    లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన శరత్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు.
    మాగుంట శ్రీనివాసులు రెడ్డి కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు.
    శరత్ రెడ్డి 55 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి విరాళం ఇచ్చారు.
    శ్రీనివాసులు రెడ్డి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు.
    సిబిఐ కేసులో మొదట సాక్షిగా కవితను సీబీఐ విచారించింది.
    ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలో సీబీఐ అరెస్ట్ చేసింది.
    కోర్టు అనుమతి లేకుండా, న్యాయవాదులకు సమాచారం లేకుండా అరెస్ట్ చేశారు.
    సీఆర్పీసీ నిబంధనలకు విరుద్ధంగా సీబీఐ కవితను అరెస్టు చేసింది.
    24 నవంబర్ 2022న దాఖలు చేసిన మొదటిది CBI ఛార్జిషీట్ లో కవిత పాత్ర లేదు.
    కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన పిళ్ళై దానిని ఉపసంహరించుకున్నారు.
    మొబైల్ ఫోన్లు ధ్వంసం చేస్తున్నారనే అనుమానంతో సంబంధంలేని అంశాలను రిమాండ్ అప్లికేషన్‌లో ప్రస్తావించారు.
    మొత్తం 11 ఫోన్‌లను ఈడీకి కవిత ఇచ్చారు. 11 ఫోన్‌లలో 4 ఫోన్‌లు ఫార్మాట్ చేయబడ్డాయి.
    ఈడీ కేసులో ఏడు అనుబంధ ఫిర్యాదులను దాఖలు చేశారు. 5వ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు ఇప్పటివరకు ఏ నిందితుడికి అందజేయలేదు.
    తమ వాదనలను పరిగణలోకి తీసుకుని కేసు వాస్తవాలు పరిశీలించి కవితకు బెయిల్ ఇవ్వాల్సిందిగా హైకోర్టును కోరిన కవితకు న్యాయవాది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు