తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం, గీతంపై సీఎం రేవంత్ ఫోకస్

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్రరాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పలు నమూనాలు పరిశీలించిన సీఎం రేవంత్.. ఒకటి ఫైనల్ చేశారు. తుది నమూనాపై రేవంత్ పలు సూచనలు చేశారు.

Telangana Song And Official Symbol : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ అవతరణ వేడుకలను అద్భుతంగా చేయాలని నిర్ణయించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. తెలంగాణ జాతీయ గీతాన్ని స్వరపరచడానికి ఇప్పటికే కీరవాణితో చర్చలు జరిపారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్రరాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పలు నమూనాలు పరిశీలించిన సీఎం రేవంత్.. ఒకటి ఫైనల్ చేశారు. తుది నమూనాపై రేవంత్ పలు సూచనలు చేశారు.

Also Read : డీఫాల్టర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?.. మంత్రి ఉత్తమ్ ను ప్రశ్నించిన మహేశ్వర్ రెడ్డి

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు