డీఫాల్టర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?.. మంత్రి ఉత్తమ్ ను ప్రశ్నించిన మహేశ్వర్ రెడ్డి

19 ప్రశ్నలుకు కేవలం ఒక్క దానికే సమాధానం ఇచ్చారు. చర్యలు తీసుకుంటాం అన్నారు. ఎవరిమీ చర్యలు తీసుకుంటారు?త‌రుగు తీసేది మీరే.. చర్యలు కూడా మీ మీదనే తీసుకుంటారా..? అని మ‌హేశ్వ‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు.

MLA Maheshwar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందని ఎప్పటి నుంచో మేము ప్రశ్నిస్తున్నప్పటికీ.. ఇన్ని రోజుల తరువాత అయినా ఉత్తమ్ స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నేను 19 ప్రశ్నలు వేస్తే ఒక్కదానికే సమాధానం ఇచ్చారు. రైస్ మిల్లర్లు వద్ద దాదాపు 22వేల కోట్ల విలువైన స్టాక్ ఉందని చెబుతున్నారు.. మరోవైపు వేల కోట్లు నష్టాల్లో ఉందని మీరే చెబుతున్నారు. మరి డిఫాల్ట్ ఉన్నరైస్ మిల్లర్ల పేర్లు ఎందుకు బయట పెట్టడం లేదని ఏలేటి ఉత్తమ్ ను ప్రశ్నించారు. రూ.వందల కోట్లు బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లందరిపై చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read : నేను చెప్పింది వాస్తవమే.. సోమవారం వివరాలు వెల్లడిస్తా: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తుంటే .. ఆయన ఎందుకు పర్సనల్ గా తీసుకున్నారో తెలియడం లేదు. నా పరిధిలోని అంశాలను మాత్రమే, సబ్జెక్ట్ మాత్రమే నేను మాట్లాడుతున్నాను. కానీ సబ్జెక్ట్ ను తప్పుదారి పట్టిస్తూ మంత్రి హోదాలో ఉండి ఉత్తమ్ నాపై వ్యక్తిగతంగా మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీజేపీ ఎలా నడుస్తుందో తెలియదా? నన్ను పైరవీ చేసి పదవి తచ్చుకున్నావ్ అని ఉత్తమ్ అన్నారు. బీజేపీకి మొదటిసారి గెలిచిన వ్యక్తిని సీఎం చేసిన చరిత్ర ఉందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. నేరుగా అపాయింట్ మెంట్ వ్యక్తి ఉత్తమ్ కుమార్.. పీసీసీ కొనుగోలు చేసుకొని తెచ్చుకున్నారని మీ సహచర మంత్రి అన్నాడు. INC అంటే ఇండియన్ కమర్షియల్ కాంగ్రెస్ అని అనేవారు ఉన్నారు. మీతో నేను చాలా సంవత్సరాలు ట్రావెల్ చేసిన. నాకు చాలా విషయాలు తెలుసు. కానీ, వాటి గురించి నేను మాట్లాడను. పుట్టు గోత్రాలు మేనమామకు తెలుసు అన్నట్లు మీవి అన్ని వ్యహారాలు నాకు తెలుసని ఉత్తమ్ వ్యాఖ్యలకు మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Also Read : బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచనలతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చాం. గతంలో నేను ఆరోపణలు చేసిన టైంలో మీరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే మా అనుమానాలు బలపడుతున్నాయంటూ ఉత్తమ్ ను ఉద్దేశించి మహేశ్వర్ రెడ్డి అన్నారు. 19 ప్రశ్నలుకు కేవలం ఒక్క దానికే సమాధానం ఇచ్చారు. చర్యలు తీసుకుంటాం అన్నారు. ఎవరిమీ చర్యలు తీసుకుంటారు?త‌రుగు తీసేది మీరే.. చర్యలు కూడా మీ మీదనే తీసుకుంటారా..? అని మ‌హేశ్వ‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఇది దొంగే దొంగ అన్నట్లు ఉందంటూ విమ‌ర్శించారు. సీబీఐ విచారణ కోరాలని సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. మీ విచారణ సంస్థలు ద్వారా అయినా విచారణ చేయాలి. లేదా కేంద్ర ప్రభుత్వం నిధులు దుర్వినియోగం అయ్యాయి కాబ‌ట్టి మేము కేంద్రం దృష్టికి కూడా ఈ విషయాలు తీసుకెళ్తాం. నేరుగా కేంద్ర ప్రభుత్వం విచారణ చేయడానికిఉన్న అవకాశాల‌ను పరిశీలించాల‌ని అడుగుతామ‌ని బీజేఎల్పీ నేత మ‌హేశ్వర్ రెడ్డి అన్నారు.

 

\

 

ట్రెండింగ్ వార్తలు