నేను చెప్పింది వాస్తవమే.. సోమవారం వివరాలు వెల్లడిస్తా: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy: సివిల్ సప్లయ్ శాఖలో అవకతవకలు జరిగాయన్నది, వందల కోట్ల రూపాయల స్కాం జరిగిందన్నది..

నేను చెప్పింది వాస్తవమే.. సోమవారం వివరాలు వెల్లడిస్తా: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై చేసిన విమర్శలపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఇవాళ మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలన్నీ ఉత్త మాటలే అని అన్నారు.

సివిల్ సప్లయ్ శాఖలో అవకతవకలు జరిగాయన్నది, వందల కోట్ల రూపాయల స్కాం జరిగిందన్నది వాస్తవమని తెలిపారు. ఆధారాలతో పాటు తాను ప్రశ్నించిన 19 అంశాలకు సమాధానం చెప్పలేక మంత్రి దాటవేయడంతోనే ఆయన డొల్లతనం బయటపడిందని అన్నారు. పూర్తి వివరాలు సోమవారం వెల్లడిస్తానని చెప్పారు.

కాగా, ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మహేశ్వర్ రెడ్డి ఢిల్లీకి డబ్బులు పంపి బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవిని కొనుక్కున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తమపై బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బీజేపీలో ఓవర్ స్పీడ్ గా పోవాలని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఓవర్ టేక్ చేయాలని మహేశ్వర రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మహేశ్వర్ రెడ్డి స్పందించారు.

బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయి: ఉత్తమ్ కుమార్ రెడ్డి