ఇన్ని శాఖలపై ఆరోపణలు వస్తున్నా సీఎం రేవంత్ మాట్లాడం లేదు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ముఖ్యమంత్రి చేసే రివ్యూలకు మంత్రులు హాజరు కావడం లేదు. మంత్రులు ముఖ్యమంత్రికి బాధ్యత వ్యహించకుండా, అధిష్టానానికి జిమ్మేదారుగా వ్యహరుస్తున్నారు.

NVSS Prabhakar: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎవరుకు వారే యమునా తీరే అన్నట్టుగా క్యాబినెట్ తీరు ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రికి కాకుండా కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రులు జిమ్మేదారుగా ఉంటున్నారని ఆరోపించారు.

”క్యాబినెట్ అంటే కలెక్టివ్ డిషన్స్ అనేలా ఉండాలి. కానీ మంత్రులు ఎవరు ఆ విధంగా వ్యహరించడం లేదు. తమ శాఖలపై అవినీతి ఆరోపణలు వచ్చినా మంత్రులు రివ్యూ చేయడం లేదు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన సబ్సిడీ రిలీజ్ చేయడం లేదు. సివిల్ సప్లయ్ శాఖపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. రైతులకు నీటి కొరత ఏర్పడినా ఇరిగేషన్ శాఖ పట్టించుకోలేదు. విద్యుత్ శాఖది సైతం అదే పరిస్థితి. ఇన్ని శాఖలపై ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి మాట్లాడం లేదు.

ముఖ్యమంత్రి చేసే రివ్యూలకు మంత్రులు హాజరు కావడం లేదు. మంత్రులు ముఖ్యమంత్రికి బాధ్యత వ్యహించకుండా, అధిష్టానానికి జిమ్మేదారుగా వ్యహరుస్తున్నారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. కాంట్రాక్టు చేసే వ్యక్తి రోడ్డు భవనాల శాఖ మంత్రి అయ్యారు. రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి రెవెన్యూ మంత్రి అయ్యారు. మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయి.. పేదల ఆస్తులు ఇంకా తగ్గుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ దోచుకుంది.. ఈరోజు కాంగ్రెస్ దోచుకుంటోంది. సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖల్లో అవినీతి జరిగింది. ముఖ్యమంత్రి సమీక్ష చేస్తే రాని మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి” అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.

Also Read: బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు