Tunisha Sharma: తునీషా శర్మ అంత్యక్రియలు పూర్తి.. కుప్పకూలిన తల్లి.. హాజరైన షీజన్ ఖాన్ కుటుంబ సభ్యులు

టెలివిజన్ నటి అయిన, 22 ఏళ్ల తునీషా ఈ నెల 24న టీవీ షూట్ సెట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఆమె బాయ్‌ఫ్రెండ్ షీనాజ్ ఖాన్, మరి కొందరు ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Tunisha Sharma: తునీషా శర్మ అంత్యక్రియలు పూర్తి.. కుప్పకూలిన తల్లి.. హాజరైన షీజన్ ఖాన్ కుటుంబ సభ్యులు

Tunisha Sharma: గత వారం ఆత్మహత్య చేసుకున్న నటి తునీషా శర్మ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం పూర్తయ్యాయి. ముంబైలోని మిరా రోడ్డులో ఉన్న శ్మశానవాటికలో తునీషా అంత్యక్రియలు నిర్వహించారు. తునీషా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహనటులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.

Russia: జీ7 దేశాలకు రష్యా షాక్.. ఫిబ్రవరి నుంచి చమురు సరఫరా నిలిపివేత

తునీషాతో కలిసి పని చేస్తున్న సహ నటులైన శివిన్ నారంగ్, విశాల్ జెత్వా, కన్వర్ ధిల్లాన్, అష్నూర్ కౌర్ తదితరులు తునీషాకు నివాళులు అర్పించారు. అంత్యక్రియల సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. ముఖ్యంగా ఆమె తల్లి కుప్పకూలిపోయింది. ఈ అంత్యక్రియలకు తునీషా బాయ్‌ఫ్రెండ్, ఆమె మరణానికి కారణమని భావిస్తున్న షీజన్ ఖాన్ తల్లి, సోదరి కూడా హాజరయ్యారు. టెలివిజన్ నటి అయిన, 22 ఏళ్ల తునీషా ఈ నెల 24న టీవీ షూట్ సెట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఆమె బాయ్‌ఫ్రెండ్ షీజన్ ఖాన్, మరి కొందరు ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. తునీషా మృతిపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Waltair Veerayya: ఈ సినిమా రొటీన్ ఎంటర్‌టైనర్.. హెడ్డింగ్ రాసిపెట్టుకోమంటున్న వీరయ్య!

దీనిపై విచారణ జరిపిన పోలీసులు షీజన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. కొంతకాలం రిలేషన్‌లో ఉన్న తునీషా శర్మ-షీనాజ్ ఖాన్ రెండు వారాల క్రితం విడిపోయారు. ఈ నేపథ్యంలో బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు కారణమయ్యాడనే కోణంలో షీజన్ ఖాన్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. లవ్ జిహాద్‌లో భాగంగానే తునీషాను షీజన్ ఖాన్ ప్రేమించి, వదిలేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కోణంలో విచారణ జరిపి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరుతున్నారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.