Maria Ryaboshapka : శివకార్తికేయన్, జాతిరత్నాలు డైరెక్టర్ సినిమాలో ఉక్రెయిన్ నటి..

‘జాతి రత్నాలు’ సినిమాతో భారీ హిట్ కొట్టిన యువ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా సినిమాని ఇటీవల ప్రకటించారు. ఈ మూవీతో ఉక్రెయిన్‌ నటి, మోడల్‌ ఇండియన్‌ సినిమాలోకి....

Maria Ryaboshapka : శివకార్తికేయన్, జాతిరత్నాలు డైరెక్టర్ సినిమాలో ఉక్రెయిన్ నటి..

Mariya

 

Maria Ryaboshapka :  ఇటీవల తమిళ హీరోలు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ఇప్పటికే తమిళ్ స్టార్ హీరోలు ధనుష్, విజయ్, కార్తీ, శివ కార్తికేయన్ లు తెలుగులో డైరెక్ట్ సినిమాలు అనౌన్స్ చేశారు. ‘జాతి రత్నాలు’ సినిమాతో భారీ హిట్ కొట్టిన యువ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా సినిమాని ఇటీవల ప్రకటించారు. శివ కార్తికేయన్ 20వ సినిమాగా ఇది తెరకెక్కనుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

 

ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు ముగించుకొని షూటింగ్ కూడా మొదలైంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీతో ఉక్రెయిన్‌ నటి, మోడల్‌ ఇండియన్‌ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. పలు సినిమాల్లో నటించిన ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషాప్క శివకార్తికేయన్‌ సరసన ఈ సినిమాలో నటించనుంది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

BiggBoss Non Stop : ఈ వారం బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఎవరున్నారంటే..

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఈ ఉక్రెయిన్‌ బ్యూటీ సందడి చేయనుంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ నటి ఇండియన్ సినిమాలో నటించనుండటంతో ఈ చిత్రానికి మరింత హైప్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాని షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంవత్సరం చివర్లో విడుదల చేయాలి అనుకుంటున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు.