NBK : ‘సూర్యవంశీ’ సినిమాలో బాలయ్య బొమ్మ

బాలయ్య షో క్రేజ్ మామూలుగా లేదసలు.. హిందీ సినిమాలోనూ ప్రోమో ప్లే చేస్తున్నారు..

NBK : ‘సూర్యవంశీ’ సినిమాలో బాలయ్య బొమ్మ

Suryavanshi Movie

NBK: అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా.. సెన్సేషనల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరెకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సూర్యవంశీ’.. దీపావళి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్ అతిథి పాత్రల్లో నటించడంతో క్రేజ్ మరింత పెరిగింది.
‘సింగం’, ‘సింబా’ లతో సాలిడ్ హిట్స్ కొట్టిన రోహిత్ శెట్టి మళ్లీ కాప్ కథతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు.

Sree Vishnu : ఎన్టీఆర్ ఫ్యాన్‌గా శ్రీ విష్ణు.. గ్రామ వాలంటీర్‌గా హీరోయిన్!

ఈ సినిమా ఇంటర్వెల్ టైంలో నటసింహా నందమూరి బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ సెన్సేషన్ క్రియేట్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ ప్రోమో ప్లే చేస్తున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ప్రోమో ప్లే అవుతున్నప్పుడు పిక్స్, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Puneeth Rajkumar : పుట్టినరోజే పునీత్ చివరి సినిమా

నవంబర్ 5న విడుదలైన ‘సూర్యవంశీ’ కేవలం రెండు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యింది. మహారాష్ట్రతో పాటు మిగతా కొన్ని చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం. ఫస్ట్ డే 26.29 కోట్లు, సెకండ్ డే 23.85 కోట్లు కలెక్ట్ చేసి, (రెండు రోజులకు 50.14 కోట్లు) సరైన కమర్షియల్ సినిమా వస్తే ఆడియన్స్ ఏ స్థాయిలో ఆదరిస్తారనే విషయం మరోసారి ప్రూవ్ చేసింది. ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. మూడో రోజుతో 75 కోట్ల మార్క్ టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారు.

Bangarraju : ‘లడ్డుందా’ అంటూ స్వర్గంలో సోగ్గాడి ఆట..