Urfi Javed : ఆ బిజినెస్‌లు అన్నీ ఓ పెద్ద స్కామ్.. నేను చాలా నష్టపోయాను..

ఇటీవల ఇలాగే బోల్డ్ డ్రెస్ వేసుకొని దుబాయ్ లో కూడా హంగామా చేయడంతో అక్కడి పోలీసులు ఉర్ఫీ జావేద్ కి సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత ఉర్ఫీ కళ్ళ కింద దెబ్బ తగిలినట్టు, నల్లగా అయిపోయి ఉన్న ఓ ఫోటో బయటకి వచ్చి వైరల్ అయింది. దీంతో ఉర్ఫీని ఎవరో కొట్టారని...........

Urfi Javed : ఆ బిజినెస్‌లు అన్నీ ఓ పెద్ద స్కామ్.. నేను చాలా నష్టపోయాను..

Urfi Javed comments on Dark Circles removing creams

Urfi Javed :  బాలీవుడ్ లో బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది ఉర్ఫీ జావేద్. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకి వచ్చాక తన బోల్డ్ డ్రెస్సులు, డిఫ్ఫరెంట్ వస్తువులతో చేసిన డ్రెస్సులు వేసుకొని బోల్డ్ భామగా పేరు తెచ్చుకుంది. రోజూ తన అందాలని చిన్న చిన్న దుస్తుల్లో చూపిస్తూ వార్తల్లో నిలుస్తుంది, సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ లో ఉంటుంది.

ఇటీవల ఇలాగే బోల్డ్ డ్రెస్ వేసుకొని దుబాయ్ లో కూడా హంగామా చేయడంతో అక్కడి పోలీసులు ఉర్ఫీ జావేద్ కి సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత ఉర్ఫీ కళ్ళ కింద దెబ్బ తగిలినట్టు, నల్లగా అయిపోయి ఉన్న ఓ ఫోటో బయటకి వచ్చి వైరల్ అయింది. దీంతో ఉర్ఫీని ఎవరో కొట్టారని, దుబాయ్ పోలీసులు కొట్టారని, కొట్టడం వల్లే కంటి కింద దెబ్బ తగిలిందని.. ఇలా అనేక రకాలుగా ప్రచారం జరిగింది.

Waltair Veerayya movie song launch : పాటకే ఇంత రచ్చా.. ఇక సినిమాకి ఏ రేంజ్ లో ఉంటుందో..

అయితే ఈ రచ్చ ఉర్ఫీ జావేద్ వరకు వెళ్లడంతో దీనిపై క్లారిటీ ఇచ్చింది. దీనిపై మాట్లాడుతూ.. నన్నెవరూ కొట్టలేదు. నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోవడానికి ఓ క్రీం వాడాను. అది నాకు చాలా ఎఫెక్ట్ అయింది. దానివల్లే నా కళ్ళ కింద అలా తయారయింది. ఈ డార్క్ సర్కిల్స్ పోగోడతాయి అంటూ క్రీంలు అమ్మే బిజినెస్ పెద్ద మోసం. ఏ క్రీం కూడా డార్క్ సర్కిల్స్ ని పోగొట్టలేదు, పైగా ఇలా నాకు జరిగినట్టు జరుగుతుంది. దీనివల్ల నేను చాలా నష్టపోయాను. మీరు కూడా డార్క్ సర్కిల్స్ పోగొడతాము అని చెప్పే క్రీంస్ వాడకండి అంటూ తెలిపింది.