Baby Movie : ఫస్ట్ డే కంటే నాలుగో రోజు కలెక్షన్స్ ఎక్కువ సాధించిన బేబీ.. ఎంతో తెలుసా..?

బేబీ మూవీ కలెక్షన్స్ జోరు ఇప్పటిలో తగ్గేలా లేదు. వీకెండ్స్ కంటే వర్కింగ్ డేస్ లో ఈ మూవీ కలెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. నాలుగో రోజు ఈ మూవీ..

Baby Movie : ఫస్ట్ డే కంటే నాలుగో రోజు కలెక్షన్స్ ఎక్కువ సాధించిన బేబీ.. ఎంతో తెలుసా..?

Vaishnavi Chaitanya Anand Deverakonda Baby Movie collections

Baby Movie Collections : ప్రెజెంట్ జనరేషన్ లవ్ స్టోరీస్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని స్కన్ నిర్మించాడు. స్టార్ క్యాస్ట్ లేకపోవడంతో ఈ మూవీ పై ఆడియన్స్ లో పెద్ద ఆసక్తి ఏమి కనిపించలేదు. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత ప్రేక్షకుల్లో ఒక మోస్తరు అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Vaishnavi Chaitanya : బేబీ విడుదలకు ముందే వైష్ణవికి సినిమా ఆఫర్ చేసిన అల్లు అరవింద్.. లేడీ ఓరియెంటెడ్ కథ..!

జులై 14న ఈ మూవీ రిలీజ్ అయ్యి మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అక్కడ మొదలయ్యింది ఈ మూవీ విజయ్ యాత్ర. మొదటిరోజే ఈ మూవీ ఏకంగా 7.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. రెండో రోజు కూడా ఆల్మోస్ట్ 7 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు మాత్రం ఈ సినిమా డబల్ మార్జిన్ కలెక్షన్స్ అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆదివారం నాడు ఈ మూవీ ఏకంగా 14 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ మూడు రోజులతోనే రిలీజైన అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ తెచ్చి పెట్టేసింది బేబీ.

Mahesh babu : మహేష్ బాబు బ్రేక్ ఫాస్ట్ ఏం తింటాడో తెలుసా? తన న్యూట్రిషనిస్ట్ గురించి బయటపెట్టిన మహేష్..

ఇక వీకెండ్ టైమ్స్ ఈ సినిమా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించింది అంటే ఒకే. కానీ వర్కింగ్ డేస్ లో కూడా చిన్న సినిమా అయిన బేబీ ప్రేక్షకులని థియేటర్స్ కి క్యూ కట్టేలా చేస్తుంది. అదికూడా ఫస్ట్ డే కంటే ఎక్కువుగా. మొదటిరోజు ఈ మూవీ 7.1 కోట్లు అందుకున్న విషయం తెలిసిందే. సోమవారం నాలుగో రోజు ఈ చిత్రం 7.5 కోట్ల గ్రాస్ అందుకుని సంచలనం సృష్టిస్తుంది. మొత్తం మీద ఈ మూవీ ఇప్పటి వరకు 31 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక ఇదే రేంజ్ కలెక్షన్స్ అందుకుంటే సెకండ్ వీకెండ్ చేరుకునే లోపే ఈ మూవీ 50 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు.