Vamshi Paidipalli : మహేష్ జీవితంలో నాకిచ్చిన స్థానానికి జీవితాంతం రుణపడి ఉంటాను..

ఈ ఈవెంట్ లో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. డైరెక్టర్ బుజ్జి నాకు ఎప్పట్నుంచో తెలుసు, అతని కష్టాన్ని దగ్గరి నుంచి చూశాను. ట్రైలర్ తోనే సినిమాకి హిట్ తీసుకొచ్చావు. తమన్.....................

Vamshi Paidipalli : మహేష్ జీవితంలో నాకిచ్చిన స్థానానికి జీవితాంతం రుణపడి ఉంటాను..

Vamshi

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

Mehar Ramesh : పూరి గారి పోకిరి.. ఇప్పుడు ఆయన శిష్యుడు సర్కారు వారి పాట..

ఈ ఈవెంట్ లో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. డైరెక్టర్ బుజ్జి నాకు ఎప్పట్నుంచో తెలుసు, అతని కష్టాన్ని దగ్గరి నుంచి చూశాను. ట్రైలర్ తోనే సినిమాకి హిట్ తీసుకొచ్చావు. తమన్ ఈ సినిమా కోసం నా సినిమాని కూడా పక్కన పెట్టి పని చేశాడు. తమన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి చేశాడు. కీర్తి మహానటి మాత్రమే కాదు మంచి మనిషి కూడా. మహేష్ గారి దగ్గరికి మహర్షి అనే కథతో వెళ్ళాను. కానీ మీరు మీ జీవితంలో నాకు ఇచ్చిన స్థానానికి ఎప్పటికి రుణపడి ఉంటాను. నాకు ఫ్రెండ్, బ్రదర అంతకంటే ఎక్కువ మహేష్. సర్కారు వారి పాట బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది.