Veera Simha Reddy : “మా బావ మనోభావాలు” అంటున్న బాలయ్య..

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి పండక్కి వస్తున్న ఈ వీరసింహారెడ్డి వరుస ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రెండు పాటలని విడుదల చేయగా, బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తాజాగా ఈ మూవీలోని మూడో పాట విడుదలకు ముహూర్తం సెట్ చేసుకున్నాడు బాలయ్య.

Veera Simha Reddy : “మా బావ మనోభావాలు” అంటున్న బాలయ్య..

Veera Simha Reddy third single release date fix

Veera Simha Reddy : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. చాలా రోజులు తరవాత బాలయ్య ఒక ఫ్యాక్షన్ కథాంశంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. సంక్రాంతి పండక్కి వస్తున్న ఈ వీరసింహారెడ్డి వరుస ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రెండు పాటలని విడుదల చేయగా, బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

Nayanthara : ప్రభాస్ కంటే బాలయ్య పెద్ద ఆకతాయి అంటున్న నయనతార..

తాజాగా ఈ మూవీలోని మూడో పాట విడుదలకు ముహూర్తం సెట్ చేసుకున్నాడు బాలయ్య. సినిమాలో ఐటమ్ సాంగ్ అంటున్న ఈ పాట డిసెంబర్ 24న సాయంత్రం గం.3:19 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు మూవీ మేకర్స్. అయితే ఈ పాటలోని లిరిక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. “మా బావ మనోభావాలు” అంటూ ఈ సాంగ్ లిరిక్స్ సాగనున్నాయి.

బాలకృష్ణకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బావ అవుతాడని అందరికి తెలిసిన విషయమే. దీంతో ఈ పాట లిరిక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పాటకి థమన్ సంగీతం అందించగా రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ సమకూరుస్తున్నాడు. ఇక ఈ పాట న్యూ ఇయర్ వేడుకల్లో మోతమోగిపోవడం పక్కా అంటున్నారు దర్శకనిర్మాతలు. మరి చూడాలి ఈ సాంగ్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.