Sudheer Babu : కొత్త సినిమాలో సుధీర్ బాబు లుక్ చూస్తే షాక్ అవుతారు.. వీడియో లీక్!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న 'మామా మశ్చీంద్ర' కొత్త మూవీ నుంచి ఒక వీడియో లీక్ అయ్యి నెట్టింట వైరల్ అవుతుంది.

Sudheer Babu : కొత్త సినిమాలో సుధీర్ బాబు లుక్ చూస్తే షాక్ అవుతారు.. వీడియో లీక్!

Sudheer Babu

Sudheer Babu : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న ‘మామా మశ్చీంద్ర’ కొత్త మూవీ నుంచి ఒక వీడియో లీక్ అయ్యి నెట్టింట వైరల్ అవుతుంది. చివరిగా సుధీర్ బాబు ‘హంట్’ అనే యాక్షన్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. 2018 లో వచ్చిన సమ్మోహనం సినిమా తరువాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ ని సుధీర్ బాబు అందుకోలేక పోయాడు. మధ్యలో ‘శ్రీదేవి సోడా సెంటర్’తో కొంత వరకు ఆకట్టుకున్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు సుధీర్ బాబు.

Sudheer Babu : పవన్ తో జానీ లాంటి సినిమా, మహేష్ ఖలేజా సినిమా చేస్తా అంటున్న సుధీర్ బాబు..

ఈ క్రమంలోనే మామా మశ్చీంద్ర చిత్రంలో సరికొత్త లుక్ లో కనిపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించిన వీడియో ఒకటి సెట్స్ నుంచి లీక్ అయ్యింది. ఈ వీడియోలో సుధీర్ బాబు లావుగా కనిపిస్తున్నాడు. బరువు పెరిగి సరికొత్త లుక్ లో కనిపించడమే కాదు, డిఫరెంట్ గెటప్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ చిన్న వీడియో గ్లింప్స్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ లో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో కనబడ్డాడు. ఇప్పుడు ఈ వీడియోలో దానికి పూర్తి బిన్నంగా కనిపించాడు. దీంతో ఈ సినిమాలో సుధీర్ బాబు డ్యూయల్ రోల్ చేయబోతున్నాడా? అని సందేహం పడుతున్నారు నెటిజెన్లు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తమిళ హీరోయిన్ మిర్నాళిని రవి ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నటిస్తుంది. తెలుగు నటుడు హర్షవర్ధన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.