Vijay66: అదిరిపోయే టైటిల్‌తో తిరిగొచ్చిన బాస్!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 66వ చిత్రం కోసం ఆయన అభిమానులతో పాటు తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను....

Vijay66: అదిరిపోయే టైటిల్‌తో తిరిగొచ్చిన బాస్!

Vijay 66 Movie Titled Varisu

Vijay66: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 66వ చిత్రం కోసం ఆయన అభిమానులతో పాటు తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై తెలుగునాట కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి విజయ్ పుట్టినరోజు కానుకగా ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశారు.

Vijay: విజయ్ కోసం నాగ్ టైటిల్‌ను వాడేస్తున్న పైడిపల్లి..?

ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ, విజయ్ 66వ చిత్రానికి సంబంధించిన టైటల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు ‘వారిసు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా, పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. ఇక ఈ సినిమాకు ‘ది బాస్ రిటర్న్స్’ అనే క్యాప్షన్‌ను ఇచ్చింది చిత్ర యూనిట్.

దీంతో ఈ సినిమాపై అప్పుడే కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో విజయ్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. సూటు, బూటు వేసుకుని అతడు కూర్చున్న పోజుకు విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను దడదడలాడించడం ఖాయమని విజయ్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు వర్షన్‌కు ఎలాంటి వస్తుందో చూడాలి. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.