Bichagadu 3 : బిచ్చగాడు 3 ని కన్‌ఫార్మ్ చేసిన విజయ్ ఆంటోనీ.. 2025లో సినిమా!

బిచ్చగాడు 2 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. తాజాగా విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 3 ని కన్‌ఫార్మ్ చేశాడు.

Bichagadu 3 : బిచ్చగాడు 3 ని కన్‌ఫార్మ్ చేసిన విజయ్ ఆంటోనీ.. 2025లో సినిమా!

Vijay Antony confirms Bichagadu 3 goes sets on 2025 under his direction

Vijay Antony Bichagadu 3 : తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు 2 రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. బిచ్చగాడు 1 తెలుగులో 15 కోట్ల కలెక్షన్స్ అందుకొని బయ్యర్లకు ఎంతో లాభాన్ని మిగల్చడమే కాకుండా 100రోజులు ఆడిన డబ్బింగ్ సినిమాగా టాలీవుడ్ లో రికార్డుని క్రియేట్ చేసింది. దీంతో సీక్వెల్ పై రిలీజ్ కి ముందే ఎంతో ఆసక్తి నెలకుంది. ఆ అంచనాలకు తగ్గట్టు తెలుగు రాష్ట్రల్లో అద్భుతమైన ఓపెనింగ్స్ ని అందుకుంది ఈ మూవీ.

Rajinikanth : శరత్‌బాబు మృతిపట్ల రజనీకాంత్ ఎమోషనల్

మొదటి రోజు వచ్చిన తమిళ కలెక్షన్స్ కంటే రెండు తెలుగు రాష్ట్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువ. దీని బట్టే అర్ధమవుతుంది తెలుగు ఆడియన్స్ బిచ్చగాడు సినిమాకి ఎంత కనెక్ట్ అయ్యారో. ఇక ఈ సీక్వెల్ కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు దీనికి మూడో భాగం తీసుకు వస్తాను అంటున్నాడు విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం బిచ్చగాడు 2 సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్న విజయ్ ఆంటోనీ.. ఈ థర్డ్ పార్ట్ ని కన్‌ఫార్మ్ చేశాడు. 2025లో బిచ్చగాడు 3 ని సెట్స్ పైకి తీసుకు వెళ్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

Vikram : స్టార్ డైరెక్టర్ వర్సెస్ హీరో విక్రమ్.. సోషల్ మీడియాలో వార్.. డైరెక్టర్ ని ట్రోల్ చేస్తున్న విక్రమ్ ఫ్యాన్స్..

ఆ సినిమాని కూడా విజయ్ ఆంటోనీనే డైరెక్ట్ చేస్తాను అంటూ ప్రకటించాడు. కాగా ఇప్పుడు ఈ సీక్వెల్ కి విజయ్ ఆంటోనీనే నటిస్తూ దర్శకత్వం వహించాడు. మొదటి పార్ట్ ని శశి డైరెక్ట్ చేశాడు. ఇక బిచ్చగాడు 2 కలెక్షన్స్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ని అందుకున్నట్లు తెలుస్తుంది. తెలుగు స్టేట్స్ లోనే మూడు రోజులకు గాను 9.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.