Vijay Devarakonda : కరణ్ జోహార్‌కి తనేంటో చూపించడానికే రౌడీ హీరో అలా చేశాడా??

బాలీవుడ్ లో కూడా పాతుకుపోదామని విజయ్ దేవరకొండ గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ కి కలల రాకుమారుడు అయిపోయాడు విజయ్. మరోవైపు బాలీవుడ్ లో అన్ని పార్టీలకు అటెండ్ అవుతూ.........

Vijay Devarakonda : కరణ్ జోహార్‌కి తనేంటో చూపించడానికే రౌడీ హీరో అలా చేశాడా??

Vijay Devarakonda

Liger :  రెండేళ్ళ నుంచి సినిమా లేదు, అంతకు ముందు చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు, సక్సెస్ ట్రాక్ అంత గొప్పగా లేదు కానీ స్టార్ హీరోలకి సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. లైగర్ తో ఈ క్రేజ్ ని, ఇమేజ్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాలని చూస్తున్నాడు విజయ్. ఆల్ ఓవర్ ఇండియా మ్యానియా క్రియేట్ చేస్తూ, జనానికి లైగర్ తో పిచ్చెక్కించేస్తున్నాడు.

బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈసారి ఎలా అయినా హిట్ కొడతానని ఫుల్ కాన్ఫిడెంట్ తో లైగర్ మూవీ చేస్తున్నాడు. ఆగస్ట్ 25 రిలీజ్ కు ఇంకా నెల రోజులు టైముండగానే ఆడియన్స్ కి ట్రైలర్ తోనే సినిమా చూపించేస్తున్నాడు. జస్ట్ ట్రైలర్ తోనే జనాల్లో మ్యానియా క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ నెవర్ బిఫోర్ క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు. లేట్ అయినా ప్రమోషన్ల విషయంలో లేటెస్ట్ గా వచ్చిన విజయ్ నిజంగానే ఆడియన్స్ లో అగ్గిరాజేస్తున్నాడు.

Anushka Shetty : 17 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎట్టకేలకు నెక్స్ట్ సినిమా షూట్ మొదలు పెట్టిన అనుష్క..

బాలీవుడ్ లో కూడా పాతుకుపోదామని విజయ్ దేవరకొండ గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ కి కలల రాకుమారుడు అయిపోయాడు విజయ్. మరోవైపు బాలీవుడ్ లో అన్ని పార్టీలకు అటెండ్ అవుతూ అందరితో కలిసిపోతున్నాడు. ఇక లైగర్ సినిమాకి బాలీవుడ్ అగ్ర దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కరణ్ ని సెట్ చేస్తే బాలీవుడ్ లో సెట్ అయిపోవచ్చు. అందుకే కరణ్ తో ఎక్కువ ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు విజయ్. ఈ సారి టాలీవుడ్ లో తన క్రేజ్ ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎవరూ ఊహించనంత గ్రాండ్ గా చేశాడు.

అసలు ట్రైలర్ లాంచ్ కి ఈ రేంజ్ ప్రమోషన్ చెయ్యక్కర్లేదు, ఎవరూ చేయలేదు కూడా. కానీ విజయ్ లైగర్ సినిమా ట్రైలర్ లాంచ్ కి బైక్ ర్యాలీ, జనాలు, కటౌట్స్ గట్టిగానే ప్లాన్ చేశాడు. ట్రైలర్ రిలీజ్ హడావిడి అనడం కంటే హంగామా, రౌడీ హీరో రచ్చ అంటేనే కరెక్ట్. అదే రేంజ్ లో ఓ టాప్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు చేసినంత హడావిడి చేశారు ఫాన్స్. ఈ ట్రైలర్ లాంచ్ హడావిడి చూపించడానికి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ని తీసుకొచ్చాడు. అలాగే అనన్య పాండే కూడా వచ్చింది. ఈ హడావిడి, రౌడీ హీరో క్రేజ్ చూసి అనన్య షాక్ అయ్యింది. కరణ్ కూడా బాగా ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది. ఇక సినిమా హిట్ అయితే కరణ్ విజయ్ ని వదిలిపెట్టడని, విజయ్ బాలీవుడ్ లో పాతుకుపోతాడని తెలిసిపోతుంది.