Vijay Devarakonda : టూర్‌కి పంపించిన అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన రౌడీ హీరో..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల తన అభిమానులను ఫ్రీ వెకేషన్ కి పంపించిన సంగతి తెలిసిందే. ఇక టూర్ కి వెళ్లిన అభిమానులను సర్‌ప్రైజ్ చేయడానికి విజయ్ దేవరకొండ కూడా కులుమనాలి పయనమయ్యాడు. ప్రత్యేక హెలికాప్టర్ లో..

Vijay Devarakonda : టూర్‌కి పంపించిన అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన రౌడీ హీరో..

Vijay Devarakonda

Vijay Devarakonda : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల తన అభిమానులను ఫ్రీ వెకేషన్ కి పంపించిన సంగతి తెలిసిందే. ఈ హీరో గత ఐదేళ్లుగా ‘దేవరశాంటా’ పేరుతో ప్రతి సంవత్సరం ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ బహుమతులు ఇస్తూ వస్తున్నాడు. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం 100 మంది అభిమానులను ఒక ఫ్రీ వెకేషన్ హాలిడేకి పంపిస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు ఆ వెకేషన్ కి ఎక్కడకి వెళ్ళాలి అనుకుంటున్నారో అనేది కూడా అభిమానుల ఛాయస్ కే ఇవ్వగా.. ఎక్కువ మంది అభిమానులు ‘మౌంటెయిన్స్ ఆఫ్ ఇండియా’కి ఓటు వేశారు. దీంతో 100 మంది ఫ్యాన్స్ ని ఇటీవల ‘కులుమనాలి’ పంపించాడు విజయ్.

Vijay Devarakonda : పులికి పాలు పట్టించి.. సింహం, పాములతో ఆడుకుంటున్న రౌడీ హీరో..

ఇక టూర్ కి వెళ్లిన అభిమానులను సర్‌ప్రైజ్ చేయడానికి విజయ్ దేవరకొండ కూడా కులుమనాలి పయనమయ్యాడు. ప్రత్యేక హెలికాప్టర్ లో మంచు పర్వతాల మీదుగా వెళుతున్న చిత్రాన్ని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అభిమానులను తన సొంత ఖర్చుతో వెకేషన్ కి పంపించడమే కాకుండా, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి ఒక మెమోరీని ఇస్తున్నావు, నువ్వు గ్రేట్ అన్నా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా హెలికాప్టర్ లో విజయ్ వెళుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక విజయ్ సినిమాలు విషయానికి వస్తే.. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకొని మధ్యలో ఉన్న మూవీ ‘ఖుషి’ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ లవ్ రొమాంటిక్ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ లో నటించబోతున్నాడు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అలాగే తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన గీతగోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఇటీవలే ఒక సినిమా ఓకే చేశాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)