Vijay : 2023 సంక్రాంతి.. చరణ్ అవుట్.. విజయ్ ఇన్..

తాజాగా 2023 సంక్రాంతి బరిలోంచి చరణ్ తప్పుకున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు తమిళ్ హీరో విజయ్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్...............

Vijay : 2023 సంక్రాంతి.. చరణ్ అవుట్.. విజయ్ ఇన్..

Rashmika

 

Dil Raju :  ఇటీవల తెలుగు సినిమాలు వరుస విజయాలు సాధిస్తుండటంతో ఇన్నాళ్లు కరోనా వల్ల వాయిదా పడ్డ సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు పండగలు, లాంగ్ వీకెండ్ ఉన్న డేట్స్ లో తమ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి డేట్స్ బ్లాక్ చేసుకుంటున్నాయి. 2023 సంక్రాంతికి కూడా ఇప్పుడే సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతో మెప్పించిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని గతంలోనే అనౌన్స్ చేశారు.

Kangana Ranaut : కంగనా లాకప్‌కి తాళం.. విన్నర్ ఏం గెలుచుకున్నాడో తెలుసా??

అయితే తాజాగా 2023 సంక్రాంతి బరిలోంచి చరణ్ తప్పుకున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు తమిళ్ హీరో విజయ్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా వంశీ పైడిపల్లి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ.. ఇలా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాని 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. చరణ్ సినిమా షూటింగ్ కి మరింత టైం పట్టనుండటంతో ఆ సినిమాని సంక్రాంతి బరిలోంచి తప్పించి విజయ్ సినిమాని తీసుకొచ్చారు దిల్ రాజు. దీంతో చరణ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.