Sukumar : ‘పుష్ప 2’లో విజయ్ సేతుపతి.. మరో విలన్‌గా కన్ఫర్మ్..

ఎప్పుడో మొదలవ్వాల్సిన పుష్ప 2 సినిమా ఇంకా స్క్రిప్ట్ వర్క్ లోనే ఉంది. సుకుమార్ పాన్ ఇండియా లెవెల్ కి తగ్గట్టు, ఆడియన్స్ అంచనాలు అందుకోవటానికి మరింత మెరుగులు దిద్దుతున్నాడు. ఇప్పటికే పుష్ప 2 గురించి.............

Sukumar : ‘పుష్ప 2’లో విజయ్ సేతుపతి.. మరో విలన్‌గా కన్ఫర్మ్..

Pushpa 2

Pushpa 2 : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సుకుమార్ ఈ సినిమాతో ఎంతటి మాస్ క్రియేట్ చేసాడో అందరికి తెలిసిందే. పుష్ప సినిమా డైలాగ్స్, పాటలు, స్టెప్స్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కలెక్షన్స్ లో కూడా దుమ్ము లేపింది ఈ సినిమా. అనుకున్న దానికంటే ఎక్కువ విజయం రావడంతో పుష్ప 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

దీంతో ఎప్పుడో మొదలవ్వాల్సిన పుష్ప 2 సినిమా ఇంకా స్క్రిప్ట్ వర్క్ లోనే ఉంది. సుకుమార్ పాన్ ఇండియా లెవెల్ కి తగ్గట్టు, ఆడియన్స్ అంచనాలు అందుకోవటానికి మరింత మెరుగులు దిద్దుతున్నాడు. ఇప్పటికే పుష్ప 2 గురించి బయట చాలా కథలు వినిపిస్తున్నాయి. స్టోరీ ఇలా ఉండబోతుందా అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. తాజగా ఓ అధికారిక న్యూస్ వచ్చింది. పుష్ప సినిమాలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్ గా చేయబోతున్నట్టు సమాచారం.

Sony Liv : ఫేమస్ పైరసీ సైట్ తమిళ్ రాకర్స్ పై వెబ్ సిరీస్..

ఇప్పటికే విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. హీరో, విలన్ అని సంబంధం లేకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తూ ప్రేక్షకులకి మరింత దగ్గరయి తన నటనతో మెప్పిస్తున్నాడు. తాజాగా పుష్ప 2లో కూడా విలన్ గా చేయడానికి రెడీ అయ్యాడు విజయ్ సేతుపతి. సుకుమార్ విజయ్ ని కలిసి కథ చెప్పి ఓకే చేయించినట్టు సమాచారం. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మొత్తానికి సినిమా లేట్ అయినా గట్టిగానే ప్లాన్ చేయబోతున్నాడు సుక్కు మాస్టర్.