Kamalhaasan : అక్కడ ‘బాహుబలి2’ రికార్డ్ బ్రేక్ చేసిన ‘విక్రమ్’

తాజాగా విక్రమ్ సినిమా ఒక్క తమిళనాడులోనే 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి తమిళనాడులో బాహుబలి 2 సినిమా పేరు మీద ఉన్న రికార్డ్ చెరిపేసింది. దీంతో తమిళనాడులో ఎక్కువ గ్రాస్.................

Kamalhaasan : అక్కడ ‘బాహుబలి2’ రికార్డ్ బ్రేక్ చేసిన ‘విక్రమ్’

Vikram

Vikram :  లోక నాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్. సూర్య ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా విక్రమ్. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేసింది. చాలా రోజుల తర్వాత కమల్ కి పెద్ద హిట్ రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటికే సినిమాకి పని చేసిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్, సక్సెస్ మీట్స్, స్పెషల్ పార్టీలు ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కమల్. ఈ సినిమా విజయంపై కమల్ చాలా సంతోషంగా ఉన్నారు.

ఇప్పటికే పలు రికార్డులని సాధించిన కమలహాసన్ విక్రమ్ తాజాగా మరో రికార్డ్ సాధించింది. తమిళనాడులో రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే అక్కడ విక్రమ్ ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. మొత్తం సినిమాకి 300 కోట్ల వసూళ్లు రాగా ఒక్క తమిళనాడు నుంచే 150 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. తమిళనాడులో ఇప్పటిదాకా ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మన బాహుబలి 2 ఉంది. బాహుబలి 2 సినిమా తమిళనాడులో 146 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.

Vijay : తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ ఆఫీసులో మృతదేహం..

తాజాగా విక్రమ్ సినిమా ఒక్క తమిళనాడులోనే 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి తమిళనాడులో బాహుబలి 2 సినిమా పేరు మీద ఉన్న రికార్డ్ చెరిపేసింది. దీంతో తమిళనాడులో ఎక్కువ గ్రాస్ వసూలు చేసిన సినిమాగా విక్రమ్ నిలిచింది. అయితే ఇంకా విక్రమ్ చాలా థియేటర్లలో రన్ అవుతుండటంతో ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒక్క తమిళనాడులోనే దాదాపు 175 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది అంటున్నారు తమిళ ట్రేడ్ వర్గాలు.