Vikram: విక్రమ్ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండగా....

Vikram: విక్రమ్ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు

Vikram Movie Pre Release Business Details

Vikram: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండగా, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Vikram: స్వాతిముత్యం కోసం వస్తున్న స్వర్ణకమలం!

అయితే ఈ సినిమాను తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమాకు మంచి ప్రీరిలీజ్ బిజినెస్ కూడా జరిగినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.95.75 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో కమల్ పర్ఫార్మెన్స్ మరో స్థాయిలో ఉండబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్

ఈ సినిమాలో కమల్ హాసన్‌తో పాటు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ఇప్పటికే ఈ అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

తమిళనాడు – 35 కోట్లు
తెలుగు – 6 కోట్లు
కర్ణాటక – 5.50 కోట్లు
మలయాళం – 4.25 కోట్లు
హిందీ – 35 కోట్లు
ఓవర్సీస్ – 16 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ – 95.75 కోట్లు.

అయితే ఈ సినిమాకు శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ క్రేజీ డీల్‌కు అమ్ముడవడంతో మొత్తంగా విక్రమ్ చిత్రం థియేట్రికల్, నాన్-థియేట్రికల్ పరంగా రూ.198.75 కోట్ల బిజినెస్ చేయడం విశేషం.