Virat Kohli: డివిలియర్స్ పేరు పిలిచిన అభిమానులు, విరాట్ వెనక్కు చూసి..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ కెప్టెన్సీ వహించిన విరాట్ కోహ్లీ అంటే బెంగళూరు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. శనివారం బ్యాట్ తీసుకుని స్టేడియంలోకి వస్తున్న సమయంలోనూ ఈ ప్రత్యేకమైన

Virat Kohli: డివిలియర్స్ పేరు పిలిచిన అభిమానులు, విరాట్ వెనక్కు చూసి..

Virat Kohli

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ కెప్టెన్సీ వహించిన విరాట్ కోహ్లీ అంటే బెంగళూరు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. శనివారం బ్యాట్ తీసుకుని స్టేడియంలోకి వస్తున్న సమయంలోనూ ఈ ప్రత్యేకమైన బాండ్ ను స్పష్టంగా చూపించాడు కోహ్లీ. కెప్టెన్ రోహిత్ అవుట్ అయి గ్రౌండ్ వదిలి వెళ్లిపోయినా విరాట్ వస్తుండగా అభిమానులు వెల్‌కమ్ చెప్తూ టాప్ లేపేశారు.

మరో వీడియోలో బెంగళూరు స్టేడియంలోని ఓ గుంపు డివిలియర్స్ పేరు చెప్తూ.. విరాట్ దగ్గరగా వస్తుండగా సందడి చేసింది. ఆ సమయంలో విరాట్ వెనక్కు తిరగ్గానే అంతా సైలెంట్ అయిపోయారు. “ABD, ABD” అని అరుస్తుండగా వెనక్కు తిరిగి డివిలియర్స్ మూమెంట్ ను చేసి చూపించాడు కోహ్లీ.. అంతే అంతా సంతృప్తితో సైలెంట్ అయిపోయారు.

రెండో టెస్టులోనూ ఇండియా ఆధిక్యం కొనసాగిస్తుంది. స్టంప్స్ సమయానికి 86పరుగుల ఆధిక్యంలో ఆరు వికెట్లు నష్టపోయింది లంక జట్టు.

Read Also: పుష్ప ట్రెండ్‌లో జాయిన్ అయిన విరాట్ కోహ్లీ

మొహాలీ వేదికగా ముగిసిన తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించి ప్రస్తుత టెస్ట్ సిరీస్ లో 1-0తేడాతో కొనసాగుతుంది. ఈ సిరీస్ తర్వాత బీసీసీఐ తర్వాతి వేదిక IPL 2022 మాత్రమే. మార్చి 26నుంచే టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది.