Vishal: లాఠీ షూటింగ్ ముగించేసిన విశాల్!

తమిళ హీరో విశాల్ నటించే ప్రతి సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో ఆయన వరుసబెట్టి సినిమాలు చేస్తూ తమిళనాట మరే ఇతర హీరోకు సాధ్యం కానీ విధంగా....

Vishal: లాఠీ షూటింగ్ ముగించేసిన విశాల్!

Vishal Wraps Up Laththi Entire Shoot

Vishal: తమిళ హీరో విశాల్ నటించే ప్రతి సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో ఆయన వరుసబెట్టి సినిమాలు చేస్తూ తమిళనాట మరే ఇతర హీరోకు సాధ్యం కానీ విధంగా జెట్ స్పీడులో సినిమాలు చేస్తూ అందరితో ఔరా అనిపిస్తున్నాడు. కాగా, ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘లాఠీ’ తాజాగా షూటింగ్ పనులు ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా విశాల్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉంది.

కానీ సినిమా షూటింగ్ సమయంలో విశాల్‌కు గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కాస్త ఆలస్యం అయ్యింది. ఇక ఇప్పుడు విశాల్ గాయాల నుండి కోలుకోవడంతో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి షూటింగ్‌ను ముగించినట్లుగా చిత్ర యేనిట్ పేర్కొంది. ఈ సినిమాను దర్శకుడు వినోద్ కుమార్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో పోలీస్ పాత్రలో విశాల్ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనట్ అంటోంది.

ఈ సినిమా షూటింగ్‌ను ఎట్టకేలకు ముగించినట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేసే యాక్షన్ సీన్స్‌కు ప్రేక్షకులు మంత్రముగ్ధులు కావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ సునైనా హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను సెప్టెంబర్ 15న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.