Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆకాశ వనంలో అర్జున కళ్యాణం’ ఇటీవల బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్...

Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ

Vishwak Sen Avak Locks Ott Release Date

Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆకాశ వనంలో అర్జున కళ్యాణం’ ఇటీవల బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపారు. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా బాగా మెప్పించడంలో సక్సెస్ కావడంతో విశ్వక్ సేన్ తన కెరీర్‌లో మరో హిట్‌ను నమోదు చేసుకున్నాడు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపించడంలో సక్సెస్ కాలేదనే విషయం అందరికీ తెలిసిందే.

Vishwak Sen : మరోసారి వార్తల్లో విశ్వక్‌సేన్.. వాటిని డిలీట్ చేయండి అంటూ హంగామా..

దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను ఇప్పటికే మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్మారు చిత్ర నిర్మాతలు. అంతేగాక, ఈ సినిమాను అనుకున్న దానికంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మరికొంత మొత్తాన్ని నిర్మాతలకు అప్పజెప్పారు ఓటీటీ నిర్వాహకులు. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను తాజాగా అనౌన్స్ చేశారు. ‘‘ఆకాశ వనంలో అర్జున కళ్యాణం’’ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వీడియోలో జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అయ్యారు.

Vishwak Sen: అశోకవనంలో అర్జున కళ్యాణం.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మేరకు ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను తాజాగా ఆహా వీడియో రిలీజ్ చేసింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా రుష్కర్ ఢిల్లోన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను విద్యా సాగర్ చింతా తెరకెక్కించగా, జే క్రిష్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని మే 6న థియేటర్లలో రిలీజ్ చేయగా, నెలరోజుల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావడం విశేషం. మరి థియేటర్లలో ఈ సినిమాను వీక్షించని ఆడియెన్స్, ఓటీటీలో ఖచ్చితంగా చూస్తారనే ధీమాను చిత్ర యూనిట్ వెల్లడించింది.