Vishwaksen : నేను పడిపోతే బాగుండు అని చాలా మంది కోరుకుంటున్నారు.. నేను ఏడవాలని అనుకుంటున్నారు..

ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఒక అభిమానికి ఇచ్చిన మాట కోసం ఇక్కడిదాకా వచ్చాడు ఎన్టీఆర్ అన్న. అభిమానుల కోసం వచ్చారు. ఎన్టీఆర్ అన్న ఇంటికి పిలిచి తమ్ముడికి భోజనం పెట్టినట్టు పెట్టి కారు దాక వచ్చి ఎక్కించాడు. అప్పుడు అన్న..............

Vishwaksen : నేను పడిపోతే బాగుండు అని చాలా మంది కోరుకుంటున్నారు.. నేను ఏడవాలని అనుకుంటున్నారు..

Vishwaksen Speech in Das Ka Dhamki Pre Release Event

Vishwaksen :  యువ హీరో విశ్వక్సేన్ దాస్ కా ధమ్కీ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా మార్చ్ 22న పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నేడు హైదరాబాద్ శిల్పకళావేదికలో దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఆస్కార్ గెలిచాక మొదటి సారి మీడియా ముందుకు ఎన్టీఆర్ రావడంతో అభిమానులు భారీగా ఈవెంట్ కి తరలివచ్చారు. ఎన్టీఆర్ రాకతో దాస్ కా ధమ్కీ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Das Ka Dhamki Pre Release Event : దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్.. నాటు నాటు ఆస్కార్ గెలిచాక మొదటి సారి మీడియా ముందుకు ఎన్టీఆర్..

ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఒక అభిమానికి ఇచ్చిన మాట కోసం ఇక్కడిదాకా వచ్చాడు ఎన్టీఆర్ అన్న. అభిమానుల కోసం వచ్చారు. ఎన్టీఆర్ అన్న ఇంటికి పిలిచి తమ్ముడికి భోజనం పెట్టినట్టు పెట్టి కారు దాక వచ్చి ఎక్కించాడు. అప్పుడు అన్న ధమ్కీ కోసం రావాలి అంటే సరే మాట ఇచ్చాను అన్నారు. ఆ తర్వాత తారకరత్న గారు చనిపోయిన సమయంలో కూడా ఆ కార్యక్రమాలు అయ్యాక నాకు ఫోన్ చేయించి ఈవెంట్ ఎప్పుడో డేట్ కనుక్కోమన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మాట గుర్తుపెట్టుకున్నాడు అన్న. ఇండియా మొత్తంలో బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఎన్టీఆర్ అన్నే. ఎన్టీఆర్ అన్నని ఇప్పటిదాకా చూసింది టీజర్ మాత్రమే. అసలు సినిమా ఇప్పుడే మొదలయింది. ఈ సినిమాకి మొత్తం డబ్బులు పెట్టేశాను. నేను పడిపోతే బాగుండు అని చాలా మంది కోరుకున్నారు. నేను ఏడ్వాలనుకున్నారు. కానీ పై నుంచి దేవుడు చూస్తున్నాడు. అందుకే ఇవాళ ఎన్టీఆర్ అన్నని పంపించాడు ఇక్కడికి. సినిమాకు డబ్బులు మొత్తం పెట్టాను, కష్టపడ్డాను. ఈ గ్యాప్ లో నేను తలుచుకుంటే హీరోగా మూడు సినిమాలు చేసేటోన్ని. కానీ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాను. ఇది విశ్వక్సేన్ 2.0 అని ఎమోషనల్ గా మాట్లాడాడు విశ్వక్.