Vodafone Idea : వోడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. రూ.181తో ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి.. రోజుకు డేటా ఎంతంటే?

Vodafone Idea : వోడాఫోన్ ఐడియా (Vi ) ప్రీపెయిడ్ యూజర్లకు అలర్ట్. టెల్కో (Vi) తమ యూజర్ల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ. 181 రీఛార్జ్ ప్లాన్ ద్వారా అనేక బెనిఫిట్స్ పొందవచ్చు.

Vodafone Idea : వోడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. రూ.181తో ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి.. రోజుకు డేటా ఎంతంటే?

Vodafone Idea announces Rs 181 data plan for its prepaid Users

Updated On : April 8, 2023 / 7:13 PM IST

Vodafone Idea : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vodafone Idea Plan) Vi తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ. 181 ప్లాన్ అనేది 4G డేటా వోచర్.. ప్రస్తుత ప్లాన్‌‌కు దీన్ని యాడ్ ఆన్‌గా పొందవచ్చు. వోడాఫోన్ రూ. 181 ప్లాన్ రోజుకు 1GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజుల వరకు ఉంటుంది. గతంలో మొబైల్ డేటా, వాయిస్ కాలింగ్, SMSలతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో గరిష్టంగా 79 రోజుల వ్యాలిడిటీతో రూ. 289, రూ. 429 ప్లాన్‌లు ఉన్నాయి. ఈ రెండు ప్లాన్‌లు Vi యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Vodafone Idea announces Rs 181 data plan for its prepaid Users

Vodafone Idea announces Rs 181 data plan for its prepaid Users

Read Also :  Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. 25GB హైస్పీడ్ డేటా, మరెన్నో కాలింగ్ బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

వోడాఫోన్ ఐడియా (Vi) రూ. 289 ప్లాన్ 48 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 600 SMM అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 4GB మొబైల్ డేటా అందిస్తోంది. అదేవిధంగా, Vi రూ. 429 ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డేటా, 1000 SMSలతో వస్తుంది. ఈ ప్లాన్ 78 రోజుల వ్యాలిడిటీతో మొబైల్ డేటాను అందిస్తుంది.

(Zerodha) సహ వ్యవస్థాపకుడు, CEO నిఖిల్ కామత్ ఇటీవల భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యపై ప్రస్తావించారు. ప్రపంచ మొబైల్ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో భారత మార్కెట్ వాటా 10ఏళ్ల కాలంలో ఎలా పెరిగిందో చెప్పుకొచ్చారు. 2012లో 2శాతం ఉన్న ఈ వాటా ఇప్పుడు 2022లో 21శాతానికి పెరిగిందన్నారు.

Read Also : WhatsApp Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకోవచ్చు తెలుసా?