Vi Smartphone Program : వోడాఫోన్ ఐడియా యూజర్లకు పండగే.. ఈ ప్లాన్లపై ఏకంగా రూ.2,400 రీఛార్జ్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Vi Smartphone Program : వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు అదిరే ఆఫర్.. వోడాఫోన్ ఐడియా స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్ కింద రూ.2400 రీఛార్జ్ డిస్కౌంట్ అందిస్తోంది..

Vi Smartphone Program : వోడాఫోన్ ఐడియా యూజర్లకు పండగే.. ఈ ప్లాన్లపై ఏకంగా రూ.2,400 రీఛార్జ్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Vodafone Idea launches ‘Vi Smartphone Program’ to offer recharge discount to its users

Vodafone Idea : వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు అద్భుతమైన ఆఫర్.. టెలికం దిగ్గజం తమ యూజర్ల కోసం కొత్తగా Vi స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్ (Vi Smartphone Program) ప్రవేశపెట్టింది. 4G లేదా 5G స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ అయిన Vi యూజర్లు అర్హులు.. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ. 2,400 విలువైన రీఛార్జ్ డిస్కౌంట్ పొందవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లోని అధికారిక Vi యాప్ ద్వారా చేసే రీఛార్జ్‌లపై మాత్రమే ఈ డిస్కౌంట్ పొందవచ్చు. కొత్త ప్రోగ్రామ్ ఎంపిక చేసిన రాష్ట్రాల్లో పరిమిత వ్యవధిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త Vi స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Vi స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్ రీఛార్జ్ డిస్కౌంట్ :
మీరు ఫీచర్ ఫోన్ యూజర్లు అయితే.. వెంటనే స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ అయిపోండి. ఎందుకంటే.. ఈ కొత్త Vi స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే సపోర్టు చేస్తుంది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. 4G లేదా 5G స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ చేసే ప్రస్తుత Vi వినియోగదారులకు Vi స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా, దేశంలో వోడాఫోన్ ఐడియా (Vi) 5G కనెక్టివిటీని ఇంకా రిలీజ్ చేయలేదు. అందుకు ఖరారు చేయడానికి వివిధ నెట్‌వర్క్ డీలర్లతో చర్చలు జరుపుతోంది. కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్‌తో వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ చేయాలని సూచిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది.

Read Also :  Vodafone Idea Plans : వోడాఫోన్ రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

Vi SIM కొనుగోలు చేసిన తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో Vi-యేతర (వోడాఫోన్) వినియోగదారులకు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం అందిస్తోంది. తద్వారా Vi యూజర్లకు కొత్త Vi స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ చెన్నై, తమిళనాడు, పంజాబ్, హర్యానాలలో జూలై 4 నుంచి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌కు అర్హులైన వోడాఫోన్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో Vi SIMని యాక్టివేట్ చేసిన ఒక రోజులోపు రూ. 2,400 రీఛార్జ్ డిస్కౌంట్ వివరాలతో (Welcome SMS)ని పొందుతారు.

Vodafone Idea launches ‘Vi Smartphone Program’ to offer recharge discount to its users

Vodafone Idea launches ‘Vi Smartphone Program’ to offer recharge discount to its users

Vi స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్ రీఛార్జ్ డిస్కౌంట్ పొందాలంటే.. వోడాఫోన్ యూజర్లు కొత్త లేదా ఇప్పటికే Vi SIM వాడుతున్న వినియోగదారులు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన రియల్ అన్‌లిమిటెడ్ లేదా హీరో రీఛార్జ్ ప్యాక్‌లతో రీఛార్జ్ చేయాలి. అర్హత గల ప్లాన్‌లలో రూ. 319, రూ. 359, రూ. 368, రూ. 369, రూ. 399, రూ. 409, రూ. 475, రూ. 479, రూ. 499, రూ. 539, రూ. 599, రూ. 601, రూ. 666, రూ. 699, రూ. 839, రూ. , రూ.901, రూ.902, రూ.903, రూ.1,066, రూ.1,449, రూ.1,999, రూ.2,899, రూ.2,999, రూ.3,099 రీఛార్జ్ ప్యాక్‌లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ రీఛార్జ్ డిస్కౌంట్ పొందేందుకు.. Vi వినియోగదారులు గత 6 నెలల్లో Vi నెట్‌వర్క్‌లో లేని స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించాలి. రీఛార్జ్ డిస్కౌంట్ పొందాలంటే.. అధికారిక Vi యాప్‌లో మాత్రమే రీఛార్జ్ చేయాలి. Vi వినియోగదారులు కొత్త స్మార్ట్‌ఫోన్‌లో తగిన ప్లాన్‌తో రీఛార్జ్ చేసిన తర్వాత.. వారికి రూ. 100 రీఛార్జ్ తగ్గింపు కూపన్ లభిస్తుంది. యాప్‌లోని మై కూపన్స్ (My Coupons) సెక్షన్ కింద ఉంటుంది. అర్హత ఉన్న ప్రతి రీఛార్జ్‌పై ఈ సెక్షన్‌లో కొత్త కూపన్ యాడ్ అవుతుంది. అర్హత ఉన్న అన్ని హీరో రీఛార్జ్ ప్యాక్‌లపై కూపన్‌లు ఆటోమేటిక్‌గా వర్తిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఉండే ప్రాంతంలో ఈ ఆఫర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోండి..

Read AlsoAirtel Unlimited 5G Data : ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరే ఆఫర్.. అన్‌లిమిటెడ్ 5G డేటా, ఫ్రీ డిస్నీ ప్లస్ సబ్‌స్ర్కిప్షన్, 15కు పైగా ఓటీటీ ఛానల్స్..