Vijay Devarakonda : లైగర్ యాటిట్యూడ్.. మరో మాస్ సాంగ్ తో విజయ్..

లైగర్ సినిమాని ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. దీంతో ఇటీవలే ప్రమోషన్ సుమొదలు పెట్టారు. తాజాగా లైగర్ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘వాట్‌ లగా దేంగే.. ’ అంటూ సాగే మాస్ సాంగ్ ని...........

Vijay Devarakonda : లైగర్ యాటిట్యూడ్.. మరో మాస్ సాంగ్ తో విజయ్..

Liger

Liger :  విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా లైగర్. కరణ్ జోహార్ కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇందులో విజయ్ ముంబయి మురికివాడకు చెందిన యువకుడిగా, ఫుల్‌ మాస్‌ లుక్‌లో, నత్తిగా మాట్లాడే పాత్రలో, కిక్ బాక్సింగ్ చేసే యువకుడిగా కనపడనున్నాడు. విజయ్ తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఇందులో స్పెషల్ పాత్రలో కనిపించనుండటంతో సినిమాకి భారీ హైప్ వచ్చింది.

Allu Arjun : బ్రాండ్ ప్రమోషన్స్ లో పోటీ పడుతున్న స్టార్స్..

లైగర్ సినిమాని ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. దీంతో ఇటీవలే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా లైగర్ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘వాట్‌ లగా దేంగే.. ’ అంటూ సాగే మాస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. దీంట్లో విజయ్.. వి ఆర్‌ ఇండియన్స్‌. మేము ఎవరికీ తీసిపోం. సోదరి నాతో రా.. మనం వెళ్దాం.. పోరాటం చేద్దాం అంటూ మొదలుపెట్టి మోటివేట్ చేసేలాగా మాస్ సాంగ్ గా చూపించారు. ప్రస్తుతం వీడియో ట్రేండింగ్ లో ఉంది. ఇందులో విజువల్స్ కూడా మాస్ గా ఉన్నాయి. కిక్ బాక్సింగ్ పోరాట సన్నివేశాలు, ముంబై స్లమ్ లో డ్యాన్స్ చేయడం చూపించారు.