Bigg Boss 5 : కంటెస్టెంట్స్‌కి సినిమా క్యారెక్టర్స్ డెడికేట్.. అర్జున్‌రెడ్డి, అపరిచితుడు??

తాజాగా ఈ వారం కంటెస్టెంట్స్ కి సరి కొత్త టాస్క్ ఇచ్చాడు నాగార్జున. స్క్రీన్ మీద కొన్ని సినిమా క్యారెక్టర్ పోస్టర్స్ కనిపిస్తాయి. ఆ క్యారెక్టర్స్ ని ఎవరికి డెడికేట్ చేస్తారు.....

Bigg Boss 5 : కంటెస్టెంట్స్‌కి సినిమా క్యారెక్టర్స్ డెడికేట్.. అర్జున్‌రెడ్డి, అపరిచితుడు??

Bigg Boss 5 :  బిగ్ బాస్ చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇక వారమంతా గొడవలు పడే కంటెస్టెంట్స్ వీకెండ్ రాగానే సరదాగా గడుపుతారు. బిగ్ బాస్ కూడా సండేను ఫండేగా మార్చేందుకు ట్రై చేస్తాడు. ప్రతి వీకెండ్ కొత్త కొత్త గేమ్స్ పెడతాడు, డ్యాన్సులు వేపిస్తాడు బిగ్ బాస్. తాజాగా ఈ వారం కంటెస్టెంట్స్ కి సరి కొత్త టాస్క్ ఇచ్చాడు నాగార్జున. స్క్రీన్ మీద కొన్ని సినిమా క్యారెక్టర్ పోస్టర్స్ కనిపిస్తాయి. ఆ క్యారెక్టర్స్ ని ఎవరికి డెడికేట్ చేస్తారు అంటూ కంటెస్టెంట్స్ కి పని చెప్పాడు నాగ్.

Aghoraa : ఇప్పటివరకు అఘోరా పాత్రలో కనిపించిన హీరోలు వీళ్ళే

ముందుగా ‘మహానటి’ పోస్టర్‌ చూపించగానే సన్నీ వెంటనే ప్రియాంక పేరు చెప్పాడు. సావిత్రితో పోలుస్తున్నందుకు పింకీ థ్యాంక్స్ చెప్తుండగా.. నిన్ను సావిత్రితో పోల్చలేదమ్మా, నువ్వు బాగా నటిస్తావు అని నాగార్జున అనడంతో అందరు నవ్వేశారు.

ఆ తర్వాత ‘రోబో’లో ‘వశీకరన్’ పోస్టర్ చూపించగా.. ఇంకొకరిని కంట్రోల్‌లో పెట్టే డా.వశీకరన్‌ పాత్ర షణ్నుకు బాగా సెట్టవుతుందని సిరి చెప్పింది. ఎందుకంటే షణ్ముఖ్ తనని కంట్రోల్‌లో పెడతాడని చెప్పింది.

తర్వాత ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ చూపించగా కాజల్.. సన్నీ అర్జున్ రెడ్డికి కరెక్ట్ గా సరిపోతాడని ఆ అగ్రెసివ్ యాటిట్యూడ్ సెట్ అవుతుందని అంది.

తర్వాత ‘రేలంగి మావయ్య’ క్యారెక్టర్ చూపిస్తే అందరూ ఒకేసారి శ్రీరామ్ చంద్రను రేలంగి మామయ్య అన్నారు. దీంతో నేనా అంటూ ఆశ్చర్యపోయాడు శ్రీరామ్.

ఆ తర్వాత ‘అపరిచితుడు’ పోస్టర్ చూపించి కంటెస్టెంట్స్ చెప్పే లోపే నాగార్జుననే మానస్ అని చెప్పాడు. దీంతో మానస్.. సార్ మీరు కూడానా అంటూ అడిగాడు.

Pushpa : ‘పుష్ప’ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నా అంటున్న జెనీలియా భర్త

అయితే ఈ సినిమా క్యారెక్టర్స్ అంకితమివ్వడం ఇంకా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రోమోలో ఇంతవరకే చూపించినా ఇవాళ రాత్రి టెలికాస్ట్ అయ్యే వీకెండ్ ఎపిసోడ్ లో మరింత ఫన్ ఉండబోతుందని తెలుస్తుంది.