WhatsApp Status Trick : వాట్సాప్ స్టేటస్ డౌన్‌లోడ్ చేయడం ఇంత ఈజీనా..!

Whatsapp Status డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఒక ట్రిక్ ఉంది. ఈ ట్రిక్ ద్వారా సులభంగా ఎవరి వాట్సాప్ స్టేటస్ అయినా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓసారి ట్రై చేయండి..

WhatsApp Status Trick : వాట్సాప్ స్టేటస్ డౌన్‌లోడ్ చేయడం ఇంత ఈజీనా..!

Whatsapp Trick Here’s How To Download Photos And Videos From A Whatsapp Status

WhatsApp Status Download Trick : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. వాట్సాప్ రిలీజ్ చేసిన అన్ని ఫీచర్లలో కన్నా స్టేటస్ ఫీచర్ ఎక్కువగా యూజర్లను ఆకట్టుకుంటోంది. వాట్సాప్ యూజర్లు ఉదయం లేవగానే తమ వాట్సాప్ స్టేటస్ పెట్టడంతోనే ఫస్ట్ డే ప్రారంభమవుతుంది. చాలామంది వాట్సాప్ యూజర్లు స్టేటస్‌గా ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు. ఆకర్షణీయమైన వాట్సాప్ స్టేటస్ చూడగానే వెంటనే దాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలని చాలామందికి అనిపిస్తుంది.

కానీ, వాట్సాప్ స్టేటస్ నేరుగా డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో లేదు. అందుకు ఒకటే మార్గం.. స్టేటస్ పెట్టినవారిని తమకు షేర్ చేయమని అడగడమే.. అందులోనూ వాట్సాప్ స్టేటస్ 24 గంటలు మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తర్వాత Whatsapp Status ఎక్స్ పెయిర్ అయిపోతుంది. ఈలోగా నచ్చిన వాట్సాప్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఒక ట్రిక్ ఉంది. ఈ ట్రిక్ ద్వారా ఈజీగా వాట్సాప్ స్టేటస్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అదేంటో ఓసారి లుక్కేయండి.

మీరు ఆండ్రాయిడ్ యూజర్లా? అయితే ఈ ట్రిక్ మీకోసమే.. గూగుల్ ప్లే స్టోర్ (Play Store)లోకి వెళ్లండి.. అక్కడ Google Files అనే యాప్ సెర్చ్ చేయండి. ఇప్పుడు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. వాస్తవానికి ఈ గూగుల్ ఫైల్స్ అనే యాప్ చాలావరకు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్ ఆప్షన్ గా ఉంటుంది. ఒకసారి మీ స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ ఉందేమో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే పర్వాలేదు. లేదంటే ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. అదే.. iOS యూజర్లు అయితే… File Manager అనే యాప్ App Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా వాట్సాప్ స్టేటస్ ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇదిగో ఈ ట్రిక్ ఫాలో అయితే చాలు  :

Google Files యాప్ ద్వారా whatsapp స్టేటస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Play Store ద్వారా Google ఫైల్‌ డౌన్‌లోడ్ చేసుకోండి.
స్క్రీన్ టాప్ రైట్ కార్నర్‌లో Menuపై నొక్కండి.
సెట్టింగ్‌లకు (Settings)లోకి వెళ్లండి.
Show Hidden Files ఆప్షన్ ON చేయండి.
మీ డివైజ్ ఫైల్ మేనేజర్‌ లోకి వెళ్లండి.
Internal Storage>WhatsApp>Media>Statuses నావిగేట్ చేయండి.
వాట్సాప్‌లో మీరు చూసిన అన్ని స్టేటస్‌ల Files ఇక్కడ చూడొచ్చు.
మీరు Save చేసే ఫొటో లేదా వీడియోపై Tap చేయండి.
కెమెరా, వాట్సాప్ ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసేందుకు లొకేషన్ ఎంచుకోండి.
లొకేషన్ ఎంచుకున్నాక ఫైల్ Save చేయడానికి Long Press చేయండి.
Statuses డౌన్‌లోడ్ చేయాలంటే Status Saver అనే Third-Party App వాడొచ్చు.
Status Saver ద్వారా స్టేటస్‌లను ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Play Store నుంచి Status Saver డౌన్‌లోడ్ చేసుకోండి.
ఇక్కడ మీకు వాట్సాప్ కాంటాక్టులోని అన్ని స్టేటస్‌లు కనిపిస్తాయి.
మీరు డౌన్‌లోడ్ చేసే ఫొటో లేదా వీడియోను ఎంచుకోవాలి. Save Iconపై నొక్కండి.
Save చేసిన Media ఫోన్ Internal Storage అవుతుంది.
అంతే.. వాట్సాప్ స్టేటస్ డౌన్ లోడ్ అయినట్టే.. ఫోన్ స్టోరేజీలో సేవ్ చేసిన ఫోటోలు, వీడియోలను యాక్సెస్ చేయవచ్చు.
Read Also : WhatsApp: మీ వాట్సాప్‌లో చాట్‌ డిలీట్ అయిందా? ఇలా రికవరీ చేసుకోవచ్చు!