Love : ముక్కోణపు ప్రేమకథను లాటరీలో పరిష్కరించిన పెద్దలు

ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపిన యువకుడికి లాటరీ విధానం ద్వారా ఒకరిని సెలెక్ట్ చేసి పెళ్లి చేశారు గ్రామపెద్దలు.. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది

Love : ముక్కోణపు ప్రేమకథను లాటరీలో పరిష్కరించిన పెద్దలు

Love

Love : ముక్కోణపు ప్రేమ సమస్యను లాటరీలో పరిష్కరించారు గ్రామపెద్దలు. ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపించిన యువకుడికి లాటరీ ద్వారా ఓ యువతిని ఇచ్చి కట్టబెట్టారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని హాసన మండలం సకలేశపుర సమీపంలోని ఓ కుగ్రామానికి చెందిన యువకుడు సోషల్ మీడియా ద్వారా ఇద్దరు అమ్మాయిలతో చాటింగ్ మొదలు పెట్టాడు.

ఇద్దరితో ప్రేమాయణం సాగించాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో చెట్టాపట్టాలేసుక తిరిగాడు. ఈ నేపథ్యంలోనే అతడికి పెళ్లి చేయాలనీ కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఈ విషయం ఇద్దరు ప్రియురాళ్లకు తెలియడంతో ప్రేమికుడి ఇంటికి వచ్చాడు. ఇద్దరు అతడిని పెళ్లి చేసుకుంటామని బిస్మిన్చుకు కూర్చున్నారు.

తన ప్రియుడు లేకపోతే బ్రతకలేమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఓ యువతి విషం తాగి ఆత్మహత్య యత్నం కూడా చేసింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చడంతో క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. ఇద్దరు యువతులు, యువకుడు కావాలని కోరుకోవడంతో పెద్దమనుషులు ఓ ప్లాన్ వేశారు. లాటరీ పద్దతి ద్వారా అమ్మాయిని సెలెక్ట్ చెయ్యాలని నిర్ణయించారు. ఇద్దరు యువతులతో మాట్లాడారు పెద్ద మనుషులు. వారు ఒకే చెప్పడంతో శుక్రవారం లాటరీ తీశారు. లాటరీలో ఆత్మహత్యకు యత్నించిన యువతి పేరు వచ్చింది.

దీంతో గ్రామపెద్దలు మరో యువతి సమక్షంలోనే వారిద్దరికి పెళ్లి చేశారు. దీంతో మరో ప్రేమికురాలు కన్నీరు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక ఈ ఘటనకు సంబందించిన విషయాలను ఆదివారం ఆ గ్రామ పెద్దలు మీడియాకు తెలిపారు. తమ గ్రామంపేరు ఎక్కడ ప్రస్తవించొద్దని వారు తెలిపారు.