Acharya: చిరు ఈ ఏడాది వస్తాడా.. లేక వచ్చే ఏడాదికి వెళ్తాడా?

గత ఏడాది కాలంగా రావాలా వద్దా అనే సినిమాల నుండి సగంలో ఆగి సెట్స్ మీదకి వెళ్లాలా వద్దా అనే షూటింగుల వరకు మళ్ళీ అందరూ వరసగా డేట్స్ ఇచ్చేస్తున్నారు. సమయం.. సందర్భం చూసుకొని..

Acharya: చిరు ఈ ఏడాది వస్తాడా.. లేక వచ్చే ఏడాదికి వెళ్తాడా?

Acharya

Acharya: గత ఏడాది కాలంగా రావాలా వద్దా అనే సినిమాల నుండి సగంలో ఆగి సెట్స్ మీదకి వెళ్లాలా వద్దా అనే షూటింగుల వరకు మళ్ళీ అందరూ వరసగా డేట్స్ ఇచ్చేస్తున్నారు. సమయం.. సందర్భం చూసుకొని డేట్స్ ఫిక్స్ చేసుకొని మిగతా హీరోలను సైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చే క్రిస్టమస్ నుండి సంక్రాంతి వేసవి వరకు ఈ కొత్త సినిమాల విడుదలకు ముహుర్తాలు చూసుకుంటున్నారు. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాని సినిమాలు కూడా డేట్స్ ఇస్తున్నా మెగాస్టార్ మాత్రం ఇంకా వెళ్లాలా వద్దా అన్నట్లే ఉన్నారు.

Prabhas: పాన్ వరల్డ్ స్థాయికి రెబల్ స్టార్.. తొమ్మిది భాషల్లో స్పిరిట్?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్.. చిరు తనయుడు రామ్ చరణ్, పూజ హెగ్డేలు నటిస్తూ బ్లాక్ బస్టర్ దర్శకుడిగా పేరున్న కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆచార్య. ఇప్పటికే ఈ సినిమా మీద మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గతనెలలోనే షూటింగ్ కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ముమ్మరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే.. ఇంకా విడుదల తేదీ మాత్రం ప్రకటించలేదు.

Big Boss 5: శ్రీరామచంద్ర.. హమీదా అర్ధరాత్రి ముద్దులు.. షో శృతి మించుతోందా?

నిజానికి ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయాలని డేట్ ఫిక్స్ చేసుకున్నారని టాక్ నడుస్తున్నా.. ఇంకా అధికారిక అప్డేట్ మాత్రం రాలేదు. అయితే పక్కాగా ఈ డేట్ కి సినిమాని రిలీజ్ చేసేయాలని కొరటాల కోరుతున్నా.. కానీ పలు కారణాల చేత నిర్మాతలు ఇంకా కన్ఫర్మ్ చెయ్యాలా వద్దా అనే డైలమాలో ఉన్నట్టు వినికిడి. ఒకవేళ డిసెంబర్ లో మిస్సయితే మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ కి వెళ్లాల్సిందేననే అనుమానాలు వినిపిస్తున్నాయి. మరి ఆ తేదీ ఎప్పుడు ప్రకటిస్తారో.. అభిమానులకు గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.