Xiaomi Smartphones : భారత్‌లో No.1 Mi ఫ్యాన్ ఫెస్టివల్ ఆఫర్లు.. షావోమీ స్మార్ట్‌ఫోన్లపై రూ.8వేలు వరకు డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!
Xiaomi Smartphones : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ స్మార్ట్‌ఫోన్లపై (Xiaomi) భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో (No.1 Mi Fan Festival)గా ప్రకటించింది. కంపెనీ అనేక రకాల స్మార్ట్‌ఫోన్‌లు, అప్లియెన్స్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Xiaomi 12 Pro, Redmi K50i available with up to Rs 8,000 discount in India_ Prices, offers
Xiaomi Smartphones : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ స్మార్ట్‌ఫోన్లపై (Xiaomi) భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో (No.1 Mi Fan Festival)గా ప్రకటించింది. కంపెనీ అనేక రకాల స్మార్ట్‌ఫోన్‌లు, అప్లియెన్స్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ ఈవెంట్ భారత మార్కెట్లో డిసెంబర్ 21 వరకు కొనసాగుతుంది.
అనేక డివైజ్‌లపై షావోమీ (Xiaomi) Snapdragon 8 Gen 1-పవర్డ్ Xiaomi 12 Pro, మధ్య-బడ్జెట్ Redmi K50i రూ. 8వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. Xiaomi ఇండియా Mi ఆన్‌లైన్ స్టోర్‌లో కస్టమర్‌లు బ్యాంక్ డీల్‌లను పొందవచ్చు. లేకపోతే, కస్టమర్‌లు తాత్కాలిక ధర తగ్గింపుతో స్మార్ట్ టీవీలు, యాక్సెసరీలను చెక్ చేయవచ్చు. రిఫ్రెష్డ్ డిజైన్‌లు, యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్‌లను అందించేందుకు తన Mi స్టోర్ యాప్‌ను కూడా రీస్టోర్ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.
Xiaomi 12pro, Mi ఫెస్టివల్ ఆఫర్లు ఇవే :
మీరు ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? Xiaomi 12 Pro అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. బేస్ 8GB RAM వేరియంట్ ధర రూ. 55,999కి రిటైల్ అవుతుంది. 12GB RAM ఆప్షన్ ధర రూ. 59,999కి విక్రయిస్తోంది. రెండు వెర్షన్లు 256GB స్టోరేజీతో వస్తాయి. షావోమీ అన్ని డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై రూ. 8వేల విలువైన ఇన్‌స్టంట్ డిస్కౌంట్లను అందిస్తోంది.

Xiaomi Smartphones : Xiaomi 12 Pro, Redmi K50i available with up to Rs 8,000 discount in India
దీని ధర వరుసగా రూ. 47,999, రూ. 51,999కి భారీగా తగ్గించింది. షావోమీ ఫోన్లపై రూ. 7వేల వరకు విలువైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. Xiaomi 12 Pro ఫోన్ మూడు 50-MP కెమెరా సెన్సార్‌లతో వచ్చింది. 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది.
రెడ్‌మి K50i ధర, Mi ఫెస్టివల్ ఆఫర్లు ఇవే :
Redmi K50i, డైమెన్సిటీ 8100 SoC ద్వారా వచ్చిన మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. 144Hz డిస్‌ప్లే, 5G, UFS 3.1 స్టోరేజ్, 67W ఫాస్ట్ ఛార్జింగ్, 64-MP ట్రిపుల్ కెమెరాలతో డాల్బీ అట్మాస్ స్పీకర్‌లు పొందవచ్చు. ఈ ఫోన్‌లోని ఫీచర్లలో 6GB RAM + 128GB స్టోరేజ్ రూ. 23,999కి అందుబాటులో ఉంది. 8GB RAM + 256GB స్టోరేజ్ రూ. 26,999కి అందుబాటులో ఉంది. యూజర్లు HDFC లేదా SBI కార్డ్‌లతో రూ. 3వేలు పొందవచ్చు. దీని ధర వరుసగా రూ. 20,999, రూ. 23,999కి తగ్గుతుంది. లేకపోతే, మీకు చౌకగా ఐఫోన్ కావాలంటే.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తోంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..