Xiaomi 13 Pro Launch : సరికొత్త డిజైన్‌తో షావోమీ 13ప్రో సిరీస్ లాంచ్.. టాప్ ఫీచర్లు ఇవే.. భారత్‌లో ధర ఎంత? సేల్ డేట్ ఎప్పుడంటే?

Xiaomi 13 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ (Xiaomi) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ షావోమీ 13 ప్రో (Xiaomi 13 Pro) సిరీస్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ సంబంధించి వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.

Xiaomi 13 Pro Launch : సరికొత్త డిజైన్‌తో షావోమీ 13ప్రో సిరీస్ లాంచ్.. టాప్ ఫీచర్లు ఇవే.. భారత్‌లో ధర ఎంత? సేల్ డేట్ ఎప్పుడంటే?

Xiaomi 13 Pro Launched _ Top specs, India price, sale date, everything else you need to know

Xiaomi 13 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ (Xiaomi) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ షావోమీ 13 ప్రో (Xiaomi 13 Pro) సిరీస్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ సంబంధించి వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. ఫిబ్రవరి 28, మధ్యాహ్నం 12 గంటలకు షావోమీ 13 Pro సిరీస్ పూర్తి వివరాలు వెల్లడించనుంది. గ్లోబల్ వేరియంట్‌లో సాఫ్ట్‌వేర్ వారీగా స్వల్ప మార్పులు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఫోన్ మొదటిసారిగా చైనాలో లాంచ్ అయింది. హార్డ్‌వేర్ మాత్రం చాలా వరకు అలాగే ఉంటుంది.

Xiaomi 13 ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC, 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. షావోమీ 13 ప్రో ఫోన్ లైకా సహ-ఇంజనీరింగ్ కెమెరా సిస్టమ్‌పై పనిచేస్తుంది. వెనుక ప్యానెల్‌లో మూడు 50-MP కెమెరాలు ఉన్నాయి. ప్రైమరీ కెమెరా 1-అంగుళాల సెన్సార్‌ను కలిగి ఉంది. Xiaomi 13 Pro ఫోన్ ఫీచర్లకు సంబంధించి పూర్తివివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

షావోమీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ ఇవే :

– Display : షావోమీ 13 Pro మోడల్ 6.73-అంగుళాల E6 AMOLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1,900 nits గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. OTT ప్లాట్‌ఫారమ్‌లు లేదా గేమింగ్‌లో మూవీలు, ఇతర షోలను చూస్తున్నప్పుడు వ్యూ ఎక్స్ పీరియన్స్ డాల్బీ విజన్, HDR 10కి కూడా సపోర్టు ఇస్తుంది. షావోమీ యూజర్లు పేపర్ లాంటి ఎండ్ అందించే రీడింగ్ మోడ్ వంటి MIUI ఫీచర్లను కూడా ఉపయోగించవచ్చు.

Read Also : WhatsApp Schedule Group Call : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై గ్రూపు కాల్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?

– SoC : షావోమీ13 Qualcomm లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా పవర్ అందిస్తుంది. శాంసంగ్ Galaxy S23 సిరీస్, iQOO 11 Pro, OnePlus 11 5Gకి కూడా ఇదే స్నాప్‌డ్రాగన్ అందిస్తుంది.

Xiaomi 13 Pro Launched _ Top specs, India price, sale date, everything else you need to know

Xiaomi 13 Pro Launched _ Top specs, India price, sale date

బ్యాక్ కెమెరా : షావోమీ 13ప్రో వెనుక కెమెరా సిస్టమ్ మూడు 50-MP కెమెరాలు (వైడ్ + అల్ట్రా + టెలిఫోటో) ఉన్నాయి. ముఖ్యంగా, రెండు విధాలుగా మాక్రో-మోడ్‌ని ఉపయోగించవచ్చు. టెలిఫోటో లెన్స్ మాక్రో కెమెరాగా కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఇప్పటికే సూపర్ మాక్రో మోడ్ ఉంది. ఇందులో తేడా ఏమిటంటే.. వస్తువుల మధ్య దూరాన్ని చూడవచ్చు. ముందు భాగంలో 16-MP కెమెరా కూడా ఉంది. ముఖ్యంగా, Xiaomi 13 Pro మోడల్ 24fps వద్ద 8K రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

– సాఫ్ట్‌వేర్ : షావోమీ 13 Pro ఫోన్ MIUI 14 ఆధారిత Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 3 మూడు ఏళ్ల OS అప్‌డేట్‌లను పొందుతుంది.

Xiaomi 13 ప్రో ఫీచర్లు ఇవే :
– షావోమీ 13 ప్రో కొత్త డిజైన్‌తో వచ్చింది. వెనుక భాగంలో సిరామిక్ ప్యానెల్ ఉంది. ఫింగర్ ఫ్రింట్ స్మడ్జ్‌లను కలిగి ఉంటుంది. అదృష్టవశాత్తూ, ఈ ఫోన్ బాక్సులో పారదర్శక సిలికాన్ కేసు ఉంది. ఫోన్ తెలుపు, నలుపు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఫోన్ అడ్జెస్ట్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. డిఫాల్ట్‌గా Xiaomi 13 ప్రో డిస్‌ప్లే Full-HD+ రిజల్యూషన్‌కు, బ్యాటరీని ఆదా చేసేందుకు 60Hz రిఫ్రెష్ రేట్‌కి సెట్ చేసి ఉంటుంది.

బ్యాటరీ విషయానికి వస్తే.. Xiaomi 13 Pro దాదాపు 30 నిమిషాల్లో పూర్తి ఛార్జ్‌ని అందించగలదు. బాక్స్‌లో టైప్-A పోర్ట్‌తో 120W ఛార్జర్ ఉంది. మరోవైపు OnePlus, Xiaomi, Motorola వంటి బ్రాండ్‌లు తమ ప్రీమియం ఫోన్‌ల బాక్స్‌లో PD ఛార్జర్‌ను అందిస్తాయి. కెమెరాలను లైకా సహ-ఇంజనీరింగ్ ద్వారా లైకా అథెంటిక్, వైబ్రంట్ అనే రెండు మోడ్‌లు ఉన్నాయి. లైకా కెమెరాలకు ప్రత్యేకమైన షట్టర్ సౌండ్ కూడా ఉంది.

భారత్‌లో Xiaomi 13 ప్రో ధర ఎంతంటే? :
షావోమీ 13 Pro భారత మార్కెట్లో నిర్దిష్ట వివరాలు రివీల్ చేయలేదు. ఫిబ్రవరి 28న ఫోన్ వివరాలను వెల్లడించనుంది. ప్రపంచవ్యాప్తంగా, Xiaomi 13 Pro ధర EUR 1,299 (సుమారుగా రూ. 1.13 లక్షలు) వద్ద ప్రారంభమవుతుంది. గత ఏడాది డిసెంబర్‌లో Xiaomi 13 Pro CNY 4,999 (దాదాపు రూ. 60వేలు) ప్రారంభ ధరతో చైనీస్ మార్కెట్‌లో లాంచ్ అయింది.

Read Also : Xiaomi 12 Pro 5G Offer : అమెజాన్‌లో షావోమీ 12ప్రో 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. మళ్లీ ధర పెరగొచ్చు.. ఇప్పుడే కొనేసుకోండి..!