Yami Gautam : సినిమాలే సర్వస్వం కాదు.. జీవితంలో ఒక భాగం మాత్రమే..

యామి గౌతమ్ మాట్లాడుతూ.. ''మన స్థాయిని మార్చేసే ఇలాంటి రంగంలో ఉన్నప్పుడు మన వృత్తి జీవితాన్ని, పర్సనల్ లైఫ్ ని వేరు వేరుగా చూడాలి. సినిమాలు నా జీవితంలో.............

Yami Gautam : సినిమాలే సర్వస్వం కాదు.. జీవితంలో ఒక భాగం మాత్రమే..

Yami Gautam

Yami Gautam :  తెలుగులో నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలతో మెప్పించిన యామి గౌతమ్ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో బిజీ స్టార్ అయిపొయింది. ఇక ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో దేశమంతటా పేరు తెచ్చుకుంది యామి. ఒకపక్క సినిమాలతో పాటు మరో పక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. ఇటీవలే దస్వీ అనే సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులని పలకరించింది.

Shraddha Das : నల్లటి చీరలో నడుమందాలతో ఎండలో మిరుమిట్లు గొలుపుతున్న శ్రద్ధాదాస్

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా యామి గౌతమ్ ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో సినిమాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యామి గౌతమ్ మాట్లాడుతూ.. ”మన స్థాయిని మార్చేసే ఇలాంటి రంగంలో ఉన్నప్పుడు మన వృత్తి జీవితాన్ని, పర్సనల్ లైఫ్ ని వేరు వేరుగా చూడాలి. సినిమాలు నా జీవితంలో ఒక భాగం మాత్రమే. సినిమాలు నాకు సర్వస్వం కాదు. అందుకే నా టైం మొత్తాన్ని నేను సినిమాలకి ఇవ్వను. నేను సినిమాలతో బిజీగా ఉన్నా రోజుకొకసారైనా కుటుంబంతో కలిసి భోజనం చేస్తాను, కుటుంబానికి సరిపడా టైం ఇస్తాను, రోజు AR రెహమాన్‌ పాటలు వింటూ సేదతీరుతాను” అని తెలిపింది. ప్రస్తుతం మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది యామి గౌతమ్.