Yami Gautam : లైంగిక వేధింపుల బాధితుల కోసం ముందుకొచ్చిన యామి గౌతమ్

తాజాగా ఓ వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది యామి గౌతమ్. ఇందులో.. ''లైంగిక వేధింపుల బాధితుల కోసం పని చేస్తున్న రెండు ఎన్​జీవోలతో నేను కలిసి పనిచేయబోతున్నాను. ఇందుకు నేను......

Yami Gautam : లైంగిక వేధింపుల బాధితుల కోసం ముందుకొచ్చిన యామి గౌతమ్

Yami

Yami Gautam :  తెలుగులో నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలతో, యాడ్స్ తో దగ్గరైన యామి గౌతమ్ ఆ తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయిపొయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది యామి గౌతమ్. ఇటీవలే ‘ఏ థర్స్​డే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఇందులో యామి గౌతమ్ నటనకి విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.

 

అయితే తాజాగా ఈ భామ లైంగిక వేధింపులకు గురైన బాధితులకు మద్దతు తెలిపింది. అలాంటి వారి కోసం పనిచేయడానికి ముందుకొచ్చింది. తాజాగా ఓ వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది యామి గౌతమ్. ఇందులో.. ”లైంగిక వేధింపుల బాధితుల కోసం పని చేస్తున్న రెండు ఎన్​జీవోలతో నేను కలిసి పనిచేయబోతున్నాను. ఇందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటి పనిలో భాగమయినందుకు చాలా గర్వంగా కూడా ఉంది. మహిళల భద్రత, వారి సమస్యలపై పని చేయాలి. భవిష్యత్తులో అన్ని వర్గాల మహిళలను రక్షించడానికి, వారికి మెరుగైన వనరులను అందించడానికి నేను నా నుంచి మరింత సహకారం అందించాలనుకుంటున్నాను.” అని తెలిపింది.

Lahari Shari : భారీగా ఖర్చు పెడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ.. మొన్న ఖరీదైన బైక్.. ఇవాళ కార్..

లైంగిక వేధింపుల బాధితుల కోసం, వారికి పునరావాసం కల్పించడానికి మజ్లిస్ లా​, పారి ఫర్ ఇండియా అనే రెండు ఎన్జీవోలతో కలిసి యామి గౌతమ్ పనిచేయనుంది. యామి తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు.