Street Fight : నడిరోడ్డుపై పిడిగుద్దులతో రెచ్చిపోయిన యువతులు
రోడ్డుపై యువకులు ఘర్షణ పడటం సర్వసాధారణం. యువకుల మధ్య ఎదో ఓ విషయంలో గొడవ జరిగి అది ఘర్షణగా మారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కోకొల్లలు. ఇక ఇదే తరహాలో ముగ్గురు యువతులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Street Fight
Street Fight : రోడ్డుపై యువకులు ఘర్షణ పడటం సర్వసాధారణం. యువకుల మధ్య ఎదో ఓ విషయంలో గొడవ జరిగి అది ఘర్షణగా మారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కోకొల్లలు. ఇక ఇదే తరహాలో ముగ్గురు యువతులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీ-షర్ట్ జీన్స్ ప్యాంటు ధరించిన ముగ్గురు అమ్మాయిల మధ్య గొడవ జరిగింది. వీరిలో ఇద్దరు ఓ వైపు ఉండి మరో యువతిపై దాడి చేశారు. కొద్దిసేపటి తర్వాత వీరిలో ఓ యువతి పక్కకు తప్పుకుంది. మరో ఇద్దరు యువతులు మాత్రం చాలా సేపు ఘర్షణపడ్డారు ఒకరినొకరు కాళ్లతో తన్నుకున్నారు, జుట్టుపట్టి లాగుతూ ఫైట్ చేశారు. అక్కడ చాలా మంది ఉన్నా వారిని అడ్డుకునేందుకు ఎవరు ముందుకు రాలేదు.
ఇక అక్కడ ఉన్నవారిలో కొందరు వీరి ఫైయిటింగ్ ని తమ కెమెరాల్లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. కాగా ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.. ఈ అరుదైన ఘటనను అక్కడ ఉన్నవారు చూస్తూ ఉండిపోయారు కానీ ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ వీడియో తీసిన వ్యక్తి ఎవరో అతడికి తన ధన్యవాదాలు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా వీడియో పెట్టిన కొద్దీ రోజుల్లోనే ఏడువేల లైక్ లను సొంతం చేసుకుంది.
View this post on Instagram