WhatsApp : ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదట.. ఎప్పటినుంచో తెలుసా?

వాట్సాప్ యూజర్లను అలర్ట్ చేస్తోంది. కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిపివేస్తున్నట్టు మెసేజ్‌లు పంపుతోంది. ఈ ఫోన్లలో వాట్సాప్ నిలిచిపోనుంది. మీ ఫోన్ ఉందో చెక్ చేశారా?

WhatsApp : ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదట.. ఎప్పటినుంచో తెలుసా?

Your Whatsapp Will Shut Down If You Have This Phone

WhatsApp shut down Services : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్లను అలర్ట్ చేస్తోంది. కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిపివేస్తున్నట్టు అలర్ట్ మెసేజ్ లను పంపిస్తోంది. ఆండ్రాయిడ్ వాట్సాప్
యూజర్లకు వాట్సాప్‌ వార్నింగ్ మెసేజ్ వస్తున్నాయి. మీ స్మార్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0 ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అదే వాట్సాప్ (4.0) వెర్షన్ వాడితే మాత్రం వెంటనే అప్ డేట్ చేసుకోవాలంట.. లేదంటే మీ ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోతాయని వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే మీరు పాత స్మార్ట్ ఫోన్లు వాడుతున్నట్టు అయితే వాట్సాప్ ఆండ్రాయిడ్ 4.1 సపోర్ట్ చేయదని తెలిపింది. ఆయా ఫోన్లలో కూడా వాట్సాప్ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది.
West Bengal : ప్రశాంత్ కిషోర్ ఇంటి అడ్రస్ మారింది..ఎందుకు ? ఏ పార్టీ కోసం ?

WBetainfo ప్రకారం.. వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్ కూడా అప్ డేట్ చేస్తోంది. తాజాగా ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0ను కూడా అప్ డేట్ చేసింది. ప్రస్తుతం తమ స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0 వాడే యూజర్లు వెంటనే 4.1 వెర్షన్ అప్ డేట్ చేసుకోవాల్సిందిగా WBetainfo నివేదిక తెలిపింది.

వాట్సాప్ అధికారిక సపోర్ట్ పేజీలోనూ వాట్సాప్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆండ్రాయిడ్ 4.1 వెర్షన్ అప్ డేట్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. నవంబర్ 1, 2021 నుంచి ఆండ్రాయిడ్ 4.0.4 వెర్షన్ లో వాట్సాప్ సర్వీసులను నిలిచిపోనున్నట్టు తెలిపింది. వాట్సాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ సపోర్ట్‌ చేయని స్మార్‌ఫోన్‌ల లిస్టులో LG Optimus L3, శామ్‌సంగ్ గెలాక్సీ SII, గెలాక్సీ కోర్, ZTE గ్రాండ్ S Plex, హువాయ్ అసెండ్ G740 ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో వాట్సాప్ లేటెస్ట్‌ వెర్షన్‌ అప్‌డేట్‌ రాదని మెసేజింగ్ యాప్ వెల్లడించింది.
Amazon.. ఇదో ఈస్ట్ ఇండియా కంపెనీ.. ఏకిపారేసిన ఆర్ఎస్ఎస్ ‘పాంచ‌జ‌న్య‌’ మ్యాగజైన్