Eyes Carry Bags : కళ్ల కింద క్యారీ బ్యాగులా?…ఏం చేయాలంటే…

కాటన్‌ బాల్‌ ను ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో ముంచి కంటి కింద అప్లై చేయండి. తీవ్రమైన ఆమ్ల గుణాలను కలిగి ఉండే ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఐబ్యాగ్స్‌ను, వాటి మచ్చలను తొలగిస్తుంది.

Eyes Carry Bags : కళ్ల కింద క్యారీ బ్యాగులా?…ఏం చేయాలంటే…

Eyes Carry Bags

Eyes Carry Bags : వయస్సు పెరిగే కొద్దీ చాలా మందిలో కళ్ల క్రింది బాగంలో చర్మం పలుచబడి వేలాడుతూ ఉంటుంది. వీటినే మనం కళ్ల కింద క్యారీ బాగులు అంటుంటాం. ఈ క్యారీ బాగుల్లోకి ఫ్లూయిడ్స్ వచ్చి చేరుతుంటాయి. వయసుతోపాటు టియర్ గ్లాండ్స్ సరిగా పనిచేయక లూబ్రికేషన్స్ తేడాలు రావటంతో కళ్ల క్రింద వాపు వస్తుంది. ఈ సమస్య చిన్నపెద్దా తేడా లేకుండా అందరిలో కనిపిస్తుంది. చిన్నవయసువారి లో కనిపించే బ్యాగ్స్‌ కొంత జాగ్రత్త తీసుకుంటే కనిపించకుండా పోతాయి. పెద్దవారిలో వచ్చేవి ఎంత యత్నించినా కొన్నిసార్లు దాచే పరిస్ధితి ఉండదు. కళ్ల చుట్టూ ఉండే కండరాల్లో వచ్చే వాపును శాస్త్రీయంగా పెరి ఆర్బిటల్‌ పఫ్ఫినెస్‌ అని, ఈ టిష్యూలో ఫ్లూయిడ్స్‌ పేరుకుపోవడం వల్ల వచ్చే వాపును పెరి ఆర్బిటాల్‌ ఎడిమా అనీ అంటారు.

ఎక్కువగా ఏడ్చేవాళ్లకు కన్నీళ్లలో ఉండే సాల్ట్‌ కారణంగా ఐబ్యాగ్స్‌ వస్తుంటాయి. అదేవిధంగా కలత నిద్ర పోయేవారిలో కంటి లూబ్రికేషన్స్‌ లో వ్యత్యాసాలు వస్తాయి. క్రమేపి కంటికింద బ్యాగులకు దారితీస్తుంటాయి. అలాగే రాత్రి పడుకొని పొద్దున లేచాక కంటి చుట్టూ ఫ్లూయిడ్‌ బాలెన్స్‌ సరిగా జరగక ఉబ్బుతుంటాయి.

పెరిఆర్బిటాల్‌ సెల్యులైటిస్, బ్లిఫారో కెలాసిస్, చాగస్‌ డిసీజ్, మోనో న్యూక్లియోసిస్‌ లాంటి కండీషన్ల కారణంగా కంటి చుట్టూ వలయాల్లో ఫ్యాట్‌ లేదా ఫ్లూయిడ్స్‌ నిల్వ చేరుతుంటాయి. కొన్ని రకాల అలెర్జీలు, చర్మవ్యాధులు కూడా ఇందుకు కారణమవుతుంటాయి. థైరాయిడ్‌ సమస్యల కారణంగా శరీరద్రావకాల్లో మ్యూకోపాలీసాఖరైడ్స్‌ తదితర రసాయనాల ఫిల్టరేషన్‌ సరిగా జరగదు. అలాంటి సందర్భాల్లోను కంటి కింద బ్యాగులు కనిపిస్తుంటాయి.

సోడియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేవారిలో పఫ్ఫీ ఐస్‌ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. దానితోపాటు స్ట్రెస్, హార్మోన్స్‌ మార్పులు, అలసట, నిద్రలేమి వల్ల సైతం ఈ కంటి క్రింద బ్యాగులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరోవైపు కొంత మందిలో క్యారీ బ్యాగులు కొంత కాలం ఉండిపోతాయి. మరి కొంత మందిలో మాత్రం దీర్ణకాలం ఉంటాయి. ఇలాంటి వారిలో సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఆ సమయంలో వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందటం మంచిది.

కొన్ని రకాల చిట్కాలను పాటించటం ద్వారా కంటి కింద బ్యాగులను పోగొట్టు కోవచ్చు. వెల్లుల్లిని దంచి వచ్చే పేస్ట్‌ను ఐబ్యాగ్స్‌పై అప్లై చేయాలి. ఆవిధంగా అరగంట పాటుంచి చల్లటి నీళ్లతో కడగాలి. ఒకవేళ సెన్సిటివ్‌ స్కిన్‌ ఉంటే మాత్రం ఎక్కువ సమయం ఈ పేస్ట్‌ను చర్మంపై ఉంచకండి. వెల్లుల్లిలో ఉండే ఎంజైమ్‌ ఫ్లూయిడ్స్‌ లో కొవ్వుల స్థాయిని తగ్గిస్తుంది.

కాటన్‌ బాల్‌ ను ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో ముంచి కంటి కింద అప్లై చేయండి. తీవ్రమైన ఆమ్ల గుణాలను కలిగి ఉండే ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఐబ్యాగ్స్‌ను, వాటి మచ్చలను తొలగిస్తుంది. ఉల్లిపాయని పిండి ఆ రసంలో కొద్దిగా ఉప్పు కలపండి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని క్యారీబ్యాగ్స్‌పై పూయాలి. పూసే సందర్భంలో కంటికి తగలనీయకండి.. మరుసటి రోజు పొద్దున్నే చల్లటి నీటితో కడగండి. ఉల్లిపాయలో ఉండే కెమికల్స్‌ కళ్ల చుట్టూ కొవ్వు పేరుకుపోవటాన్ని ఆపుతాయి.

ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల మెంతులు నానబెట్టి, మరుసటిరోజు ఉదయం పరగడుపున తాగండి. మెంతులు బాడ్‌ కొలెస్ట్రాల్‌ను, పేరుకుపోయిన ఫ్యాట్‌ను తొలగిస్తాయి. ఆహారంలో ఉప్పు తగ్గించడం, లో కార్బోహైడ్రేట్‌ డైట్‌ తీసుకోవడం, ఏ, సీ, ఈ విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, అధికంగా నీరు తాగడం ద్వారా తగ్గించుకోవచ్చు. నిద్రలో తల కింద కాస్త ఎత్తు ఉంచుకోవడం, కళ్లకు కోల్డ్‌ కంప్రెస్‌ ట్రీట్మెంట్‌ ద్వారా ఫ్లూయిడ్‌ అసమతుల్యతను తాత్కాలికంగా సరిచేయవచ్చు.