Urine : మూత్రంలో నురుగు వస్తుందా!…అయితే కారణం తెలుసుకోండి?..

ఒత్తిడిగా ఉన్నపుడు, మీ మూత్రంలో నురుగు కనిపిస్తుంది. దీనికి యూరిన్ లో ఉండే ప్రోటీన్, ఆల్బుమిన్ కారణం కావొచ్చు. మూత్రపిండాలు ఒత్తిడికి గురయితే, మూత్రంలో ప్రోటీన్స్ లీక్ అవుతుంది.

Urine : మూత్రంలో నురుగు వస్తుందా!…అయితే కారణం తెలుసుకోండి?..

Urine : ఆరోగ్యవంతులైన  ప్ర‌తి ఒక్క‌రికీ మూత్రం లేత ప‌సుపు రంగులో వ‌స్తుంది. నీళ్లు ఎక్కువ‌గా తాగే వారికి మూత్రం తెల్ల‌గా వ‌స్తుంది. నీళ్లను త‌క్కువ‌గా తాగితే మూత్రం ప‌సుపు రంగులో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇలా భిన్న ర‌కాలుగా మూత్రం క‌నిపిస్తుంది. అయితే కొంద‌రికి మూత్రంలో నురుగు వ‌స్తుంది. దాని వెనుక ఉండే కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మూత్ర‌శ‌యం బాగా నిండిన‌ప్పుడు స‌హ‌జంగానే మూత్ర విస‌ర్జ‌న చేస్తే మూత్రం బాగా వేగంగా వ‌స్తుంది. మూత్రాన్ని బాగా వేగంతో పోసిన‌ప్పుడు మూత్రంలో స‌హ‌జంగానే నురుగు క‌నిపిస్తుంది. ఇలా గ‌న‌క జ‌రిగితే కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు.

అథ్లెట్లు, క్రీడాకారులు, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసే వారి మూత్రంలో నురుగు క‌నిపిస్తుంది. వీరు కూడా ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. నురుగుతో కూడిన మూత్రం డిహైడ్రేషన్ వల్ల కూడా కావొచ్చు. మీకు డిహైడ్రేషన్ అయితే, మీ మూత్రంలో ప్రోటీన్స్, కొన్ని రసాయనాలు అధిక స్థాయిలో పెరగవచ్చు. డీహైడ్రేషన్ నివారించుకోవడానికి ఎక్కువ నీరు తాగాలి. గర్భధారణ సమయంలో నురుగుతో కూడిన మూత్రం రావడం సాధారణం. గర్భధారణ సమయంలో, ఊపిరితిత్తులు అధిక పనిని కలిగి ఉంది, ప్రోటీన్ మూత్రంలోకి వెళ్ళడానికి నురగ కారణం కావొచ్చు. మూత్రంలో నురుగుకు గుండె సమస్యల లక్షణాలు కావొచ్చు. మూత్రంలో ప్రోటీన్ అధిక స్థాయిలో ఉన్నపుడు గుండెపోటు వంటి సమస్యలకు దారితీయవచ్చు.

ఒత్తిడిగా ఉన్నపుడు, మీ మూత్రంలో నురుగు కనిపిస్తుంది. దీనికి యూరిన్ లో ఉండే ప్రోటీన్, ఆల్బుమిన్ కారణం కావొచ్చు. మూత్రపిండాలు ఒత్తిడికి గురయితే, మూత్రంలో ప్రోటీన్స్ లీక్ అవుతుంది. ఆసందర్భంలో నురుగు కనిపిస్తుంది. మధుమేహం కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపించి, మూత్రం నురగగా ఉండడానికి కారణమవుతుంది. అధిక బ్లడ్ షుగర్ స్థాయి మూత్రపిండాలకు ఇబ్బంది తెచ్చిపెడుతుంది. మూత్రనాళాలు బాక్టీరియా బారిన పడినపుడు, నురగతో కూడిన మూత్రం వచ్చే అవకాశం ఉంది. యూటిఐ కూడా మూత్రంలో ప్రోటీన్ లీకేజ్ ని కలిగిస్తుంది.

మూత్రంలో ప్రోటీన్ ఎక్కువ‌గా పోయే వారికి మూత్రంలో నురుగు వ‌స్తుంది. మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉంటే, ఆ స్ధితిని ప్రోటీన్యూరియా అంటారు. మూత్రపిండాలు ప్రోటీన్ ని సరిగా ఫిల్టర్ చేయలేకపోతే, వైద్యుడిని సంప్రదించడం మంచిది. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి, నెఫ్రోటిక్ సిండ్రోమ్‌, నెఫ్రైటిస్‌, కిడ్నీ ఫెయిల్యూర్‌, మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్ ఉన్న‌వారికి స‌హ‌జంగానే ఇలా జ‌రుగుతుంది. వారి మూత్రంలో నురుగు క‌నిపిస్తుంది. అయితే పైన ఇచ్చిన రెండు కార‌ణాలు కాక‌పోతే ఇప్పుడు తెలిపిన కార‌ణాల వ‌ల్లే మూత్రంలో నురుగు వ‌స్తున్న‌ట్లు అనుమానించాలి. వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకుని అందుకు అనుగుణంగా మందుల‌ను వాడాలి. లేదంటే స‌మ‌స్య తీవ్ర‌త‌రం అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఈ విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించ‌రాదు.