weight : ప్రసవం తరువాత బరువు తగ్గటం ఎలా?..

వ్యాయం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నించాలనుకుంటే ఇది ఒక మంచి పద్దతి. కానీ, వైద్యుల సలహా ప్రకారం, రెగ్యులర్ వ్యాయామం చేయాల్సి ఉంటుంది .

weight : ప్రసవం తరువాత బరువు తగ్గటం ఎలా?..

Pregnancy Food

weight : స్త్రీ జీవితంలో ప్రెగ్నెన్సీ, డెలివరీ సమయంలో అనేక శారీరక మార్పులు చవిచూడాల్సి వస్తుంది. ప్రసవం సమయంలో ఉండే అధిక బరువు, ప్రసవం తర్వాత కూడా అలాగే కొనసాగితే, తల్లికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదనపు బరువు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ప్రెగ్నన్సీ తరువాత స్త్రీలందరు వారి శరీర బరువు తగ్గించుకొని, తిరిగి సాధారణ శరీర బరువును, ఆకృతిని పొందాలి అనుకుంటారు. నిజానికి ప్రెగ్నన్సీ తరువాత శరీర బరువు తగ్గించుకోవటం చాలా కష్టం అని చెప్పవచ్చు. ప్రెగ్నన్సీ తరువాత శరీర బరువు తగ్గించుకోటానికి, గర్భానికి ముందు పాటించిన ఆరోగ్యకర జీవనశైలితో పాటు, సహనం, అంకిత భావంతో, వాస్తవికంగా మరియు సానుకూల దృక్పథంతో ప్రయత్నించాలి.అలవాట్లను కొద్దిగా మర్చుకోవడం వల్ల ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గలేదని ఆందోళన చెందకుండా సహనంతో ఉండాలి. ఒత్తిడి లేకుండా జీవించడాన్ని ప్రయత్నించాలి. ప్రెగ్నన్సీ తరువాత స్త్రీలు మంచి ఆహారాలతో పాటు, వ్యాయామాలను అనుసరించటం వలన శరీర బరువు తగ్గించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ప్రెగ్నన్సీ ముగిసిన తరువాత, ఆహార సేకరణలో కొన్ని సవరణలను అనుసరించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రెగ్నన్సీ తరువాత బరువు తగ్గించుకోటానికి పాలిచ్చే తల్లులు కఠినమైన డైట్ ను పాటించకూడదు. ఎక్కువ డైట్ ను పాటించడం కంటే, బరువు, శరీరంలో కొవ్వు పెరగడానికి ఉపయోగపడని ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువ తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

కొవ్వును నిరోధించే తాజా కూరగాలను మీ డైట్ లిస్ట్ లో చేర్చుకోవాలి. కడిగే ఫైబర్‌లు జీర్ణక్రియను మెరుగుపరిచి, అదనపు కొవ్వు పదార్థాలు, చక్కెరలు మరియు పిండిపదార్థాలను గ్రహించటాన్ని మరియు నిల్వలను తగ్గిస్తాయి. హోల్ గ్రైన్స్, బెర్రీలు, బ్రౌన్ రైస్ మరియు పండ్లలో కరిగే ఫైబర్ లు అధిక మొత్తంలో ఉంటాయి. వరి, ఓట్స్, చాయ్ మరియు బార్లీ వంటి వాటిలో నీటిలో కరిగే ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఫైబర్ అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువగా తినటం వలన ఆకలి ఎక్కువగా అనిపించదు మరియు గర్భం తరువాత ఉన్న అధిక బరువును సులభంగా తగ్గిస్తాయి.

వ్యాయం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నించాలనుకుంటే ఇది ఒక మంచి పద్దతి. కానీ, వైద్యుల సలహా ప్రకారం, రెగ్యులర్ వ్యాయామం చేయాల్సి ఉంటుంది . అధికంగా నీటిని తాగటం వలన శరీరంలో ఉండే విష పదార్థాలు భయటకు పంపబడి, చివరగా శరీర బరువు తగ్గించబడుతుంది. భోజనానికి ముందు ఒక గ్లాసు మంచి నీటిని తాగండి. దీని వలన ఆకలిగా అనిపించటం తగ్గి, ఆహరం తక్కువ తీసుకుంటారు.అధిక మొత్తంలో ఆకుకూరలు మరియు పండ్లు ఉండేలా ప్రణాళికను రూపొందించుకోండి. కొన్నిసార్లు, భోజనానికి బదులుగా కేవలం పండ్లను మాత్రమే తినవచ్చు.

ప్రసవం తరువాత భోజనాన్ని నియంత్రణలో తీసుకోవటం వలన శరీర బరువు తగ్గుతుంది. వారంలో 3 సార్లు సూప్‌లను తాగండి. అధిక బరువును తగ్గించుటలో ఈ పద్దతి కూడా శక్తివంతంగా పని చేస్తుంది. సూప్‌లలో తక్కువ క్యాలోరీలు, అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉండి, పొట్ట నిండినట్టుగా నిపించేలా చేస్తాయి. మధ్యాన్న భోజనం అధికంగా తిన్నట్లయితే రాత్రి తక్కువ క్యాలోరీలను అందించే బటర్ మిల్క్ లేదా మీగడ తీసిన పాలను తాగాలి. రెగ్యులర్ పనులతో పాటు యోగాను చేయడం వల్ల పోస్ట్ నేటల్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.