Calcium : శరీరంలో కాల్షియం తగిన మోతాదులో లేకుంటే గుండెజబ్బుల ముప్పుతప్పదా?

శరీరానికి తగినంత క్యాల్షియం లభించేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు ఎముకల క్షీణతను నివారించుకోవటానికి క్యాల్షియం మాత్రలు వేసుకుంటుంటారు. అయితే వీటితో గుండె కవాట సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు, ఇవి చివరికి గుండె వైఫల్యానికి దారితీస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

Calcium : క్యాల్షియం ఎముకల పటుత్వానికి చాలా కీలకమైనది. అదే క్రమంలో ఒక్క ఎముకలు, దంతాల ఆరోగ్యానికే కాదు. రక్తం గడ్డ కట్టేలా చూడటం, కండరాలు, నాడులు సక్రమంగా
పనిచేయటం గుండె సాధారణం కొట్టుకునేలా చేయటంలో కీలకం. మనం తగినంత క్యాల్షియం తీసుకోకపోతే శరీరం ఎముకల నుంచి దీన్ని తీసుకొని వాడుకుంటుంది. ఇది ఎముక
క్షీణతకు దారితీస్తుంది. తగినంత క్యాల్షియం తీసుకోకపోతే రక్తపోటు కూడా పెరిగి ఫలితంగా గుండె జబ్బుల ముప్పు ఏర్పడుతుంది.

అందుకే శరీరానికి తగినంత క్యాల్షియం లభించేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు ఎముకల క్షీణతను నివారించుకోవటానికి క్యాల్షియం మాత్రలు వేసుకుంటుంటారు. అయితే వీటితో
గుండె కవాట సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు, ఇవి చివరికి గుండె వైఫల్యానికి దారితీస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఆహారం ద్వారానే తగినంత క్యాల్షియం
లభించేలా చూసుకోవటం ఉత్తమం. పెద్దవారికి సగటున రోజుకు 1000 నుంచి 1200 మి.గ్రా. క్యాల్షియం అవసరమౌతుంది.

పాల ఉత్పత్తులు, క్యాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలను రోజుకు 2 నుంచి 4 సార్లు తీసుకుంటే ఈ మోతాదును శరీరానికి అందించవచ్చు. పాలు, పెరుగు, ఛీజ్‌ వంటి వాటిల్లో క్యాల్షియం
అధికంగా ఉంటుంది. బాదం, సోయా, జీడిపప్పు పాల వంటి వాటిల్లోనూ క్యాల్షియంను చేర్చి విక్రయిస్తున్నారు. కాల్షియం తీసుకుంటే సరిపోదు. శరీరం దీనిని సరిగా గ్రహించుకునేలా
చూసే విటమిన్‌ డి కూడా అవసరమన్న విషయం మర్చిపోకూడదు. ప్రతి రోజూ శరీరానికి 20 నిమిషాల సమయం ఎండ తగిలేలా చూసుకుంటే చర్మమే విటమిన్‌ డిని తయారు
చేసుకుంటుంది. విటమిన్ డి కోసం సాల్మన్‌, టూనా వంటి కొవ్వుతో కూడిన చేపలు, పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవచ్చు.

అధిక కాల్షియంతోనూ సమస్యలే ;

అదే క్రమంలో కాల్షియం అధికం మొత్తంలో తీసుకుంటే నరాలు, రక్తనాలాలో కాల్షియం పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. దీన్నే వాస్కులర్ కాల్సిఫికేషన్ అంటారు. దాని స్థాయి ఎక్కువగా ఉంటే అది అధిక కొలెస్ట్రాల్ సమస్యలా ప్రాణాంతకం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్, రక్తం గడ్డకట్టడం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. రక్తనాళాలలో కాల్షియం పేరుకుంటే ధమనులు గట్టిపడతాయి, దీని వలన గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడుతుంది. రోజువారి ఆహారంలో కాలిఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ, చేపలు, బెర్రీలు, ఆలివ్ ఆయిల్, ఓట్స్, ఉల్లిపాయలు, ఆకుకూరలు, బీన్స్ వంటి ఆహారం చేర్చుకోవటం ద్వారా సిరల్లో కాల్షియం పేరుకుపోకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు