Sapota Fruits : వేసవి కాలంలో రోజుకు రెండు సపోటా పండ్లు తింటే చాలు…మంచి ఆరోగ్యం మీ సొంతం!

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ గుణాలు కూడా వీటిలో ఎక్కువే. సపోటాలో విటమిన్-ఏ, విటమిన్-సి ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి యాంటీఆక్సీడెంట్లు లభిస్తాయి. సపోటాలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు లభిస్తాయి. క్యాల్షియం, పొటాషియం, కెరొటనాయిడ్లు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, పాస్పరస్ కూడా సమృద్ధిగా ఉన్నాయి.

Sapota Fruits : వేసవి కాలంలో రోజుకు రెండు సపోటా పండ్లు తింటే చాలు…మంచి ఆరోగ్యం మీ సొంతం!

Sapota Fruits :

Sapota Fruits : వేసవి కాలం ప్రారంభమైంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండుతున్న ఎండలకు కాస్త చల్లదనాన్ని ఇచ్చే పండ్లు, జ్యూస్ లు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో అనేక రకాల పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అలాంటి వాటిలో సపోటా కూడా ఒకటి. పలుచని చర్మం కింద తేనె రంగులో ,తియ్యటి గుజ్జుతో తినడానికి మధురంగా ఉంటుంది. దీంతో ఐస్‌క్రీములు, మిల్క్ షేక్స్, ఫ్రూట్ సలాడ్స్ తయారుచేసుకుని తీసుకుంటారు.

శరీరాన్ని చల్లబరిచే గుణం ఈ పండులో ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అలసటను తగ్గించడంలో రక్తవృద్థిలో సహకరిస్తుంది. మూడు పండ్లు తీసుకుని వాటిపై తొక్కను తొలగించి మూడు గ్లాసుల పాలు, ఒక స్పూన్ మీగడ, ఒక స్పూన్ వెనీలా కలిపి తయారుచేసిన మిల్క్ షేక్ వేసవి కాలంలో తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వేసవిలో సపోటాలు తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ;

1. సపోటా పండులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి కీలకంగా వ్యవహరిస్తుంది. కాల్షియంతోపాటు మాగ్నిషియం, పొటాషియం, జింక్‌, కాపర్‌, పాస్పరస్‌, సెలినియం వంటి మినరల్స్‌ కూడా అధికంగా ఉంటాయి.

2 రోజుకు కనీసం రెండు, మూడు సపోటా పండ్లు తింటే పిల్లలకు, పెద్దలకు ఎన్నో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళేవారిలోను, టెన్షన్ వర్క్స్ చేసేవారు సపోటాను తింటే అలసట వెంటనే తగ్గుతుందని.. కొత్త ఉత్సాహం కూడా వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

3. సపోటాలో యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధకతను పెంపుకు ఉపయోగపడే ‘ఎ, బి, సి’విటమిన్లు ఉంటాయి. సపోటా పండ్లను తరచూ తింటే దృష్టి లోపాలు కూడా దూరమవుతాయి. రోజూ ఒక పండు చొప్పున తింటూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఊపిరితిత్తులకు ఎంతో మేలు జరుగుతుంది.

2. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ గుణాలు కూడా వీటిలో ఎక్కువే. సపోటాలో విటమిన్-ఏ, విటమిన్-సి ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి యాంటీఆక్సీడెంట్లు లభిస్తాయి. సపోటాలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు లభిస్తాయి. క్యాల్షియం, పొటాషియం, కెరొటనాయిడ్లు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, పాస్పరస్ కూడా సమృద్ధిగా ఉన్నాయి.

3. సపోటాలో రక్తవృద్ధి, దాతుపుష్ఠిని కలిగించే అంశాలతో పాటు మరెన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇవి మలబద్దక సమస్యను తొలగించడంతో పాటు ఈ పండులో కొన్ని రసాయనాలుపేగు చివర ఉండే పలుచని శ్లేష్మపొర దెబ్బతినకుండా కాకుండా కాపాడతాయి.

5. రక్తహీనత ఉన్నవారు, గర్భిణులు, వయోవృద్దులు తరచూ సపోటా పండ్లను తింటే శరీరానికి అవసరమైన ఇనుము అంది రక్తహీనత నుంచి బయటపడతారు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి.

6. సపోటాపండులో చర్మ, జుట్టు సమస్యలను నివారించి, సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేసే గుణం కూడా కలిగి ఉంటుంది. దీనిలోని పోషకాలు శరీరంలోని హానికారకాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తికి, చర్మంపై ఏర్పడే ముడతల నివారిస్తుంది. కడుపులో చికాకు కలిగించే బొవెల్‌ సిండ్రోమ్‌ నివారణకు, మలబద్ధకం సమస్య పరిష్కారానికి దీనిలో ఫైబర్‌ గుణాలు ఉపకరిస్తాయి.

7. ఖర్జూరాలను సపోటాల్లో చేర్చి జ్యూస్‌ రూపంలో తీసుకున్న లేదంటే సపోటాను నేరుగా తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటును తగ్గించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. సపోటాలోని మాగ్నిషియం రక్తనాళాల పనితీరును క్రమబద్దీకరిస్తుంది. పొటాషియం రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేసి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

8. సపోటా లో ఉండే ప్రక్టోజ్ వల్ల శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుంది. సపోటా హానికరమైన ఫ్రీ రాడికల్స్ ని నివారిస్తుంది. క్రమం తప్పకుండా వేసవి కాలం ఈ జ్యూస్ తాగడం వల్ల శరీర వేడి తగ్గుతుంది.